మహానందీశుడికి టీటీడీ పట్టువస్త్రాలు
మహానంది: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందిలో కొలువైన కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వార్లకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు తీసుకొచ్చారు. టీటీడీ ఏఈఓ మోహన్‌రాజు దంపతులు బుధవారం మహానందికి చేరుకుని ఈఓ శ్రీనివాసరెడ్డి, వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ఉప ప్రధాన అర్చకులు వనిపెంట జనార్దనశర్మ, ముఖ్య అర్చకులు మణికంఠశర్మలకు అందజేశారు. కార్యక్రమంలో ఏఈఓ ఎరమల మధు, ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్‌రెడ్డి, దేవిక, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీశైలం శ్రీనివాసులు, మహానంది శ్రీనివాసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment