మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు బుధవారం భక్తులు పోటెత్తారు. ఆలయ అధికారులు ఆలయ పూజావేళల్లో మార్పులు చేశారు. వేకువజాము రెండు గంటల నుంచే దర్శనానికి భక్తులను అనుమతించారు. ఉచిత దర్శన క్యూలైన్ భక్తుల క్యూ క్షేత్ర ప్రధాన వీధుల వద్దకు చేరింది. స్వామివారి దర్శనానికి సుమారు ఆరు గంటల సమయం పట్టింది. క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులకు దేవస్థానం ఉచితంగా తాగునీరు, అల్పాహారాన్ని అందించింది. కొందరు భక్తులు ఉపవాస దీక్ష చేపట్టి ఉదయం నుంచి రాత్రి వరకు ఎటువంటి ఆహారం తీసుకోకుండా శివనామస్మరణ చేశారు. శివమాలను స్వీకరించిన భక్తులు జ్యోతిర్ముడిని సమర్పించారు. పాగాలంకరణ తిలకించిన శివస్వాములు శివమాలధారణ విరమించారు.
నేడు రథోత్సవం, తెప్పోత్సవం
బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదవ రోజు గురువారం శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారికి రథోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 8గంటలకు ఆలయ పుష్కరిణి వద్ద స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు తెప్పోత్సవం నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment