వైద్యుల సూచన లేకుండా మందులు వాడొద్దు
ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే కొంత కాలం ఓపిక పడితే శరీరమే దానిని నయం చేసుకుంటుంది. అవసరం లేకపోయినా మందులు వాడితే గ్యాస్ట్రబుల్, కడుపులో అల్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. తప్పనిసరైతేనే వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా మెడికల్‌షాపులకు వెళ్లి మందులు కొని ప్రమాదాలు తెచ్చుకోవద్దు.
– డాక్టర్ మోహన్‌రెడ్డి, గ్యాస్ట్రో ఎంట్రాలజి హెచ్‌వోడి, జీజీహెచ్, కర్నూలు
నొప్పుల మాత్రలతో కిడ్నీ జబ్బులు
ఇటీవల కాలంలో నొప్పుల నివారణకు పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఆర్‌ఎంపీలు ఇచ్చే ఇలాంటి మాత్రల వల్ల కిడ్నీలు త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది. ప్రతి మందుకూ ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ తప్పనిసరిగా ఉంటుంది. వైద్యులు రోగుల వ్యాధి లక్షణాలు, శరీరతత్వాన్ని బట్టి మందులు సూచిస్తారు. దీనివల్ల రోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
– డాక్టర్ ఎస్.అబ్దుల్ సమద్,
యురాలజిస్టు, కర్నూలు
వైద్యుల సూచన లేకుండా మందులు వాడొద్దు
Comments
Please login to add a commentAdd a comment