రాష్ట్రంలో అరాచక పాలన
కల్లూరు: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. పోసాని కృష్ణమురళి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కక్షలతో రాజకీయ ప్రత్యర్థులను, కళాకారులను, విశ్లేషకులను అరెస్టు చేస్తున్నారన్నారు. గొంతుకు ఆపరేషన్ చేయించుకుని అనారోగ్యంతో ఉన్నా పోసానిపై చంద్రబాబు సర్కారు తన క్రూరత్వాన్ని ఆపలేదన్నారు. మహాశివరాత్రి రోజు హైదరాబాద్‌లో ఉన్న పోసాని ఇంటికి రాత్రిపూట పోలీసులను పంపి, అరెస్టు చేయించారన్నారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్న వారిపై కక్ష తీర్చుకోవడానికి పోలీసు యంత్రాంగాన్ని, వ్యవస్థలను దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారన్నారు. అరెస్టు అయిన వ్యక్తికి న్యాయం సహాయం అందకుండా, బెయిలు రానీయకుండా, నెలల తరబడి జైల్లో అక్రమంగా నిర్భంధించేలా ఒక తప్పుడు సంప్రదాయాన్ని చంద్రబాబు తీసుకువచ్చారన్నారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వం, పోలీసుల తీరు మారదడం లేదన్నారు. సోషల్ మీడియా వేదికగా ‘పచ్చ’ సైకోలు రోజూ చెలరేగిపోతున్నారన్నారు. మహిళలు, చిన్నారులు, కుటుంబ సభ్యులు ఇలా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తున్నారన్నారు. పోలీసులు పక్షపాతం వహిస్తూ వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఫిర్యాదులను తొక్కి తెడుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పాలన జరిగిన మంచితో పోల్చిచూస్తే కూటమి ప్రభుత్వ పనితీరు అత్యంత దారుణంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా రాష్ట్రంలో ప్రజలకు జరిగిన మంచి ఏమీ కనిపించడం లేదన్నారు.
పతాక స్థాయికి కక్ష రాజకీయాలు
వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా
అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment