చిరుతది సహజ మరణమే
శ్రీశైలం/ప్రాజెక్ట్: శ్రీశైలం క్షేత్రపరిధిలోని రుద్రపార్క్ సమీపంలో మృతి చెందిన చిరుతది సహజ మరణమేనని శ్రీశైలం రేంజ్ అటవీ అధికారి పి.సుభాష్ తెలిపారు. చిరుత కళేబరానికి స్థానిక రేంజ్ కార్యాలయ ప్రాంగణంలో గురువారం పోస్టుమార్టం నిర్వహించారు. సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి మహ్మద్ అబ్దుల్ రవూఫ్ షేక్, నేషనల్ టైగర్ కన్జర్వేటర్ అథారిటీ నామినీ కె.శంకర్, నాగార్జున సాగర్– శైలం వైల్డ్ లైఫ్ నిపుణులు డాక్టర్ అరుణ్ వెస్లీ, వెటర్నరీ డాక్టర్ పి.జుబేర్, సెక్షన్ ఆఫీసర్ మదన్, బీట్ ఆఫీసర్ ఠాగూర్ పాల్గొన్నారు. ఈ మేరకు రేంజ్ అధికారి సుభాష్ మాట్లాడుతూ.. చిరుత కొద్దిరోజుల క్రితం రుద్రపార్క్ గోడకు 30 మీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో సహజ మరణం చెందినట్లు గుర్తించామన్నారు. ఆ ప్రాంతంలో చిరుత ఎముకలు, వెంట్రుకలు, ఇతర అవశేషాలు లభించాయన్నారు. అయితే చిరుత మృతి చెందిన ప్రాంతం నుంచి రుద్రపార్క్ గోడ ప్రహరీపైకి కళేబరం ఎలా వచ్చిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment