ఏప్రిల్ 12న ఫోరెన్సిక్ మెడిసిన్ రాష్ట్రస్థాయి సదస్సు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీలో ఏప్రిల్ 12, 13వ తేదీల్లో ఫోరెన్సిక్ మెడిసిన్ రాష్ట్రస్థాయి వార్షిక సదస్సు నిర్వహించనున్నట్లు ఆ విభాగాధిపతి, ఏపీఏఎఫ్‌ఎంటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ టి.సాయిసుధీర్ చెప్పారు. ఇందుకు సంబంధించి బ్రోచర్‌లను గురువారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాల ఆవిర్భావం(1957) నుంచి ఇప్పటి వరకు ఫోరెన్సిక్ మెడిసిన్ స్పెషాలిటిలో రాష్ట్రస్థాయి వార్షిక సదస్సు నిర్వహించలేదన్నారు. మొట్టమొదటిసారి రాష్ట్రస్థాయి వార్షిక సదస్సును ఏపీ అకాడమి ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజి(ఏపీఏఎఫ్‌ఎంటీ) ఆధ్వర్యంలో ఏపీ ఫర్‌మెడికాన్–2025 పేరుతో సదస్సు నిర్వహంచనున్నట్లు తెలిపారు. ఫోరెన్సిక్ ఫిజీషియన్–ఎ క్లినికల్ ఫోరెన్సిక్ మెడిసిన్ ఎక్స్‌పర్ట్ అనే థీమ్‌తో ఈ కాన్ఫరెన్స్ రూపొందించామన్నారు. సదస్సుకు హాజరయ్యేందుకు తప్పక రిజిస్టర్ చేసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment