కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది జూన్‌లో నిర్వహించిన లా 3, 5 సంవత్సరాల కోర్సు 1, 3 సెమిస్టర్ పరీక్షల ఫలితాలు, సెప్టెంబర్‌లో జరిగిన 5, 7,9 సెమిస్టర్ పరీక్షల రీ వాల్యుయేషన్ ఫలితాలను గురువారం విడుదల చేశారు. వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వి. వెంకట బసరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్‌ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. 3 సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ మొదటి సెమిస్టర్‌కు 56 మందికి 18, మూడో సెమిస్టర్‌కు 66 మందికి 20, ఐదో సెమిస్టర్‌కు 94 మందికి ఇద్దరు ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. 5 సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ మొదటి సెమిస్టర్‌కు 12 మందికి 0, మూడో సెమిస్టర్‌కు 10 మందికి 1, ఐదో సెమిస్టర్‌కు ఇద్దరికి 0, ఏడో సెమిస్టర్‌కు 20కి 0, తొమ్మిదో సెమిస్టర్‌కు 12 మందికి ఇద్దరు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.
యువకుడి దుర్మరణం
ఆత్మకూరురూరల్: ఆత్మకూరు – దోర్నాల మార్గంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. మండలంలోని శ్రీపతిరావు పేటకు చెందిన సుమిత్ర(26) అనే యువకుడు గురువారం ఉదయం పని మీద ఆత్మకూరుకు వచ్చాడు. పని పూర్తయిన తర్వాత బైక్‌పై స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా పట్టణ శివారులోని సొసైటీ గోడౌన్ వద్ద ఎదురుగా వస్తున్న బోలెరో వాహనం వేగంగా వచ్చి ఢీ కొంది. ఈ ప్రమాదంలో సుమిత్ర తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ నారాయణ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి వివరాలు సేకరించి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment