రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
జమ్మలమడుగు రూరల్: జమ్మలమడుగు రైల్వే స్టేషన్‌లో రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా.. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం కాకరవాడ గ్రామానికి చెందిన దండే హరీష్‌రెడ్డి(28) బీటెక్ పూర్తి చేశాడు. రెండు రోజుల క్రితం జమ్మలమడుగు పట్టణంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. గురువారం తెల్లవారుజామున 5 గంటలకు విజయవాడ నుంచి ధర్మవరం వెళుతున్న రైలు జమ్మలమడుగు స్టేషన్ సమీపంలోకి రాగానే హరీష్‌రెడ్డి ఒక్కసారిగా రైలు పట్టాలపై తల పెట్టాడు. దీంతో తల, మొండెం వేరయ్యాయి. కాగా బీటెక్ పూర్తి చేసినా ఉద్యోగం రాకపోవడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం
మంత్రాలయం: కర్ణాటక మద్యాన్ని భారీగా స్వాఽ దీనం చేసుకున్నట్లు మంత్రాలయం సీఐ రామాంజులు తెలిపారు. మంత్రాలయం పరిమళ పెట్రోల్ బంక్ సమీపంలో గురువారం వాహనాల తనిఖీలు చేపట్టామన్నారు. కారులో కోడుమూరు మండలం పాలకుర్తి గ్రామానికి చెందిన ఈడిగ విజయ్‌కుమార్ గౌడ్, అదే మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన దూదేకుల షేక్షావలి అనే ఇద్దరు వ్యక్తులు 34 బాక్స్‌లలో 3264 జాన్స్ ఒరిజనల్ చాయిస్ డీలక్స్ విస్కీ 90ఎంఎల్ టెట్రా ప్యాకెట్స్ పట్టుబడినట్లు తెలిపారు. ఇందులో ఈడిగ విజయ్‌కుమార్ గౌడ్ పరారీ కాగా.. షేక్షావలి పట్టుబడినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి, మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని , కారును సీజ్ చేసినట్లు తెలిపారు.
అనారోగ్యంతో
వ్యక్తి బలవన్మరణం
కోసిగి: అనారోగ్యంతో మండల పరిధిలోని జుమ్మాలదిన్నె గ్రామానికి చెందిన తిక్కయ్య(50) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. మద్యం తాగుడుకు బానిసై తిక్కయ్య అనారోగ్యానికి గురయ్యాడు. గురువారం ఉదయం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నంకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి కోసిగి ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం 108 ఆంబులెన్స్‌లో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతిని భార్య మాదేవి, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మల్లన్న సేవలో కార్మికశాఖ మంత్రి సుభాష్
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం శ్రీభ్రమరాంబా మ ల్లికార్జున స్వామి వార్లను రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సుభాష్ దర్శించుకున్నారు. గురువారం శ్రీశైల ఆలయం వద్దకు చేరుకున్న మంత్రికి ఆలయ రాజగోపురం వద్ద పీఆర్వో టీ.శ్రీనివాసరావు, అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన మల్లికార్జున స్వామివారిని, భ్రమరాంబాదేవిని దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment