గద్వాల జిల్లా వృషభాల జయకేతనం
కృష్ణగిరి: మండలంలోని చుంచు ఎర్రగుడి గ్రామంలో రామలింగేశ్వరస్వామి మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గురువారం స్వా మి వారిని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం, కబడ్డీ, బండలాగుడు పోటీలను ప్రారంభించారు. ఆరుపళ్ల వృషభాల బండలాగుడు పోటీల్లో విజేతలుగా గద్వాల జిల్లా ఎస్‌ఎస్‌కె బుల్స్ హర్షద్‌పాష, అబ్దుల్ బాషా వృషభాలు ప్రథమ స్థానంలో నిలిచి రూ.40వేల నగదు బహుమతి గెలుచుకున్నాయి. తర్వాతి నాలుగు స్థానాలలో వరుసగా కర్నూలు బి.తాండ్రపాడు చిన్నరత్నం వృషభాలు, పందికోన, మల్యాలకు చెందిన ఎస్‌ఎస్‌వివీ టైగర్స్, షేక్ మైమున్నా ఎద్దులు సంయుక్తంగా, నంద్యాల కొణిదెల వెంకటేశ్వర్లు , కోడుమూరు వర్కూరు తలారి రామచంద్ర వృషభాలు వరుసగా రూ. 30వేలు, రూ.20వేలు, రూ.10వే లు, రూ.5వేలు నగదు గెలుచుకున్నాయి. అలాగే.. హోంటీమ్ టోర్నీ పేరుతో నిర్వహించిన రాష్ట్రస్థాయి పురుషుల కబడ్డీ పోటీల విజేతగా గోనెగండ్ల జట్టు నిలిచి రూ.20 వేలు గెలుచుకుంది. తర్వాతి మూడు స్థానాలలో వరుసగా పంచలింగాల జట్టు, డోన్ వి.బొంతిరాళ్ల జట్టు, చుంచుఎర్రగుడి జట్లు నిలిచి వరుసగా రూ.15వేలు, రూ.10వేలు, రూ.5వేలు సొంతం చేసుకున్నాయి.
నాణ్యమైన భోజనం అందించాలి
కర్నూలు కల్చరల్: ఆర్‌యూ హాస్టళ్లలో పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని వీసీ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఉద్యోగులను ఆదేశించారు. ఆయన గరువారం వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఎన్‌టీకే నాయక్‌తో కలిసి వర్సిటీలోని మెన్స్, ఉమెన్స్ హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాల, భోజన శాలలను పరిశీలించారు. హాస్టళ్లలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మెస్ బిల్లులు విద్యార్థులకు అందుబాటులో ఉండేటట్లు చూస్తూనే నాణ్యత కలిగిన పదార్థాలను అందించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న సివిల్, ఎలక్ట్రికల్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ ఉద్యోగులను ఆదేశించారు. హాస్టళ్లలో నీటి సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
గద్వాల జిల్లా వృషభాల జయకేతనం
Comments
Please login to add a commentAdd a comment