‘రెడ్‌బుక్’ అమలుపై ప్రజల తిరుగుబాటు
చిప్పగిరి: రాష్ట్రంలో మంత్రి నారా లోకేశ్ ‘రెడ్‌బుక్’ రాజ్యాంగం అమలు తారా స్థాయికి చేరిందని, దీనిపై ప్రజలు తిరగబడే సమయం ఆసన్నమైందని ఆలూరు ఎమ్మెల్యే బి. విరూపాక్షి అన్నారు. చిప్పగిరిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే మాట్లాడారు. పోసాని కృష్ణ మురళిని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. అసలు ఏ కారణం చేత అరెస్టు చేస్తున్నారో పోలీసు సిబ్బందికి కూడా తెలియదనన్నారు. ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అనతి కాలంలోనే ప్రజల నుంచి అసంతృప్తి మూటగట్టుకున్నారన్నారు. అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొత్తేమీ కాదని విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా.. అక్రమ అరెస్టులే పనిగా పెట్టుకొని పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ‘రెడ్‌బుక్’ రాజ్యాంగం అమలును పక్కన పెట్టి పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు లోక్‌నాథ్, ఓబులేసు, మల్లికార్జున, నాగరాజు, ధర్మేంద్ర, నాగప్ప తదితరులు పాల్గొన్నారు.
అక్రమంగా పోసాని కృష్ణమురళి అరెస్టు
ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి
Comments
Please login to add a commentAdd a comment