● కర్నూలులోని ఉద్యాన భవన్ వేదిక
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయం, గ్రామీణ శ్రేయస్సుపై శనివారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వెబ్‌నార్ నిర్వహించనున్నారని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్‌డీఎం) ఎస్‌ఆర్ రామచంద్రరావు శుక్రవారం ఒకప్రకటనలో తెలిపారు. కర్నూలులోని ఉద్యానభవన్‌లో శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు వెబ్‌నార్ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రైతులతో ప్రధాని ముఖాముఖి అవుతారని తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ) ద్వారా పంపిణీ చేసే వ్యవసాయ రుణ రాయితీ రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. వెబ్‌నార్‌లో నాబార్డు డీడీఎం సుబ్బారెడ్డి, అధికారులు, రైతులు పాల్గొంటారని తెలిపారు.
నెలాఖరు వరకు పశుగణన
కర్నూలు(అగ్రికల్చర్): 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమాన్ని ఈ నెల చివరి వరకు పొడిగించారు. గత అక్టోబర్ చివరి వారంలో మొదలైన పశుగణన ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరి నెల చివరితో ముగియాల్సి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 4,73,516 ఇళ్లు ఉన్నాయి. 15 ఏళ్ల కాలంలో లక్షలాది కొత్త గృహాలు వెలిశాయి. వీటిన్నంటిని కూడా ఎన్యూమరేటర్లు సందర్శించి పశుగణన చేపట్టాల్సి ఉంది. ఇందులో భాగంగానే మార్చి నెల 31 వరకు పశుగణనను పొడిగించినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జి.శ్రీనివాస్ తెలిపారు.
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 69 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. మొదటి సంవత్సరం 23,098, ద్వితీయ సంవత్సరం 22,227 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రతి కేంద్రంలోని గది గదికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రం నుంచి జోనల్, రాష్ట్ర స్థాయి ఇంటర్మీడియెట్ కార్యాలయం వరకు పర్యవేక్షణ చేసేందుకు లైవ్‌స్ట్రీమ్ సదుపాయాలను కల్పించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పరీక్షలకు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యమైనా పరీక్షకేంద్రాల్లోకి అనుమతించరు.
ఇంటి దగ్గర పింఛన్ కష్టమే!
● 300 మీటర్ల దూరంలో పంపిణీ
కర్నూలు(అగ్రికల్చర్): ఇంటి దగ్గర పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. లబ్ధిదారుల ఇళ్లను జియో ట్యాగింగ్ చేయగా.. ఇంటి నుంచి 300 మీటర్ల( మూడు పర్లాంగులు) దూరంలో పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంది. 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పంపిణీ చేస్తుంటే కారణాలను యాప్‌లో నమోదు చేయాల్సి ఉంది. అలాగే ప్రభుత్వ సందేశాన్ని ఆడియో రూపంలో లబ్ధిదారులకు చూపించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మార్చి 1న చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో పైలెట్‌గా ప్రారంభించనున్నారు. జిల్లాలో ఇంతవరకు ఒక్క సచివాలయంలో కూడా 100 శాతం ఇంటిదగ్గర పింఛన్‌లు పంపిణీ చేయలేదు. గ్రామ, వార్డు సచివాలయాలు, రచ్చబండల దగ్గరే పంపిణీ సాగుతోంది. మార్చి నెలకు సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4,53,829 పింఛన్లకు రూ.195.28 కోట్లు మంజూరు అయ్యాయి. ఈ నెలలో 1,095 పించన్‌లపై కోత పడింది.
‘లేపాక్షి’లో క్లియరెన్స్ సేల్స్
కర్నూలు(అగ్రికల్చర్): తెలుగు సంవత్సరాది ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో కొండారెడ్డిబురుజు సమీపంలోని లేపాక్షి హ్యాండీక్రాప్ట్ ఎంపోరియంలో యూనివల్ క్లియరెన్స్ సేల్స్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మేనేజర్ తిమ్మయ్య తెలిపారు. ఈ సదుపాయం మార్చి1 నుంచి 31వ తేదీ వరకు అమలులో ఉంటుందని ఆయ న శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాప్ట్ డెవలప్‌మెంట్ కా ర్పొరేషన్ ఆదేశాల మేరకు అన్ని రకాల వస్తువులపై 10 శాతం, ఎంపిక చేసిన వస్తువులపై అఫ్‌టు 50 శాతం తగ్గింపు సదుపాయం ఉంద ని తెలిపారు. హస్తకళా వస్తువులు, చేనేత వ స్త్రాలు అందుబాటులో ఉన్నాయని, ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మకాలు జరుగుతాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment