నేరాల నియంత్రణకు కృషి
● జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు (టౌన్): నేరాల నియంత్రణకు పోలీసులు సమష్టిగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో శుక్రవారం నేర సమీక్ష నిర్వహించారు. పోలీసు స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాటి సంఖ్యను తగ్గించాలని ఆదేశించారు. హత్య కేసులు, పోక్సో కేసులు ఎప్పటి కప్పుడు తెలియజేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. మోటారు సైకిల్ నడిపే సమయంలో పోలీసు సిబ్బంది కూడా హెల్మెట్ ధరించాలన్నారు. పోలీసు స్టేషన్లను ఆశ్రయించే బాధితుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలన్నారు. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, లీగల్ ఆడ్వైజర్ మల్లికార్జున రావు, డీఎస్పీలు బాబు ప్రసాద్, శ్రీనివాసాచారి, హేమలత, భాస్కరరావు, ట్రైనీ డీఎస్పీ ఉషశ్రీ, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
నేరాల నియంత్రణకు కృషి
Comments
Please login to add a commentAdd a comment