డ్రిప్‌పై తప్పుడు ప్రకటనలు
యువనేస్తం, మహాశక్తి, ఉచిత బస్సు అమలు చేయకపోవడంతో ఉమ్మడి జిల్లాలో ఏడాదికి రూ.7,179.09 కోట్లు లబ్ధిదారులకు నష్టం వాటిల్లింది. ఈ బడ్జెట్‌లో వీటి ప్రస్తావన లేకపోవడంతో రెండేళ్లకు రూ.14,358.18కోట్లు కోల్పోయినట్లే. నిజాని ప్రతి ఇంటికీ ఉద్యోగం కల్పిస్తామని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, అప్పటి వరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేల భృతి చెల్లిస్తామన్నారు. ఈ లెక్కన అధికారం చేపట్టిన రోజు నుంచి ఉద్యోగం కల్పించే వరకూ భృతి చెల్లించాల్సి ఉన్నా మంగళం పాడేశారు.
డ్రిప్ ఇరిగేషన్‌ను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, దాన్ని తాము పునరుద్ధరిస్తున్నామని మంత్రి ప్రకటించారు. అయితే గత ప్రభుత్వం రెండు బడ్జెట్‌లలో ఉమ్మడి జిల్లాలో ఏటా 27,500 ఎకరాలకు డ్రిప్ మంజూరు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ దఫా బడ్జెట్‌లో 14వేల హెక్టార్లకే డ్రిప్‌ను ప్రతిపాదించింది.
గుంటూరు, ప్రకాశం జిల్లాలో మిర్చి క్లస్టర్ యూనిట్ ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ రెండూ పొరుగు జిల్లాలు. గుంటూరులో అతిపెద్ద మిర్చి మార్కెట్ ఇప్పటికే ఉంది. అయినప్పటికీ ఆ ప్రాంతంలోనే రెండు క్లస్టర్ యూనిట్‌లు ఏర్పాటుకు సిద్ధమైన ప్రభుత్వం కర్నూలును విస్మరించింది. ఉమ్మడి గుంటూరులో 1,07,053 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 55,799 ఎకరాల్లో మాత్రమే మిర్చి సాగవుతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1,17,867 ఎకరాల్లో మిర్చి సాగవుతోంది. అనంతపురంలోనూ 35,443 ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. కనీసం కర్నూలులో క్లస్టర్‌యూనిట్ ఏర్పాటు చేసి ఉంటే రాయలసీమకు ఎంతో ఉపయోగకరం. అలాంటిది కేశవ్ సీమ వాసిగా ఈ ప్రాంతాన్నే విస్మరించడం పట్ల రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
డ్రిప్‌పై తప్పుడు ప్రకటనలు
Comments
Please login to add a commentAdd a comment