పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం
కర్నూలు(సెంట్రల్): ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి.. పరిశ్రమల స్థాపనకు ప్రోత్సహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్‌పోర్టు ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..టమాటా, ఉల్లి, మిర్చి, మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఇతర పరిశ్రమలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పత్తికొండలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ , ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్‌పై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. నియోజకవర్గానికి ఒక ఎంఎస్‌ఎంఈ పార్కు సంబంధించి భూమి గుర్తించేందుకు సంబంధిత ఆర్‌డీఓలు, సబ్ కలెక్టర్లతో పరిశ్రమల శాఖ, ఏపీఐఐసీ జెడ్‌ఎం సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా త్వరగా రుణాలు ఇవ్వాల ని బ్యాంకర్లను ఆదేశించారు. కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. అనంతరం రూ.1.69 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలకు ఆమోదం తెలిపారు. పరిశ్రమల శాఖ ఇన్‌చార్జ్ జీఎం అరుణ, ఏపీఐఐసీ జెడ్‌ఎం చిరంజీవి, ఐలా చైర్మన్ రామకృష్ణారెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ విజయకుమార్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రాజమహేంద్రనాథ్, దళిత ఇండియన్‌చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కో ఆర్డినేటర్ దిలీప్, లీడ్ బ్యాంకు మేనేజర్ రామచంద్రరావు, ఏపీఎంఐపీ పీడీ ఉమాదేవి, ఉద్యాన శాఖాధికారి రామాంజనేయులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా
పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం
Comments
Please login to add a commentAdd a comment