‘గురు’ భక్తి.. భక్త కోటికి ముక్తి
● నేటి నుంచి శ్రీరాఘవేంద్రుల గురు వైభవోత్సవాలు ● ఆరు రోజుల పాటు ఉత్సవాల నిర్వహణ
మంత్రాలయం: ప్రహ్లాదరాయల స్వరూపులు.. భక్తుల కల్పతరువు.. శ్రీరాఘవేంద్రస్వామి. పవిత్ర తుంగభద్ర నదీతీరాన సశరీరంగా బృందావనస్థులై ఖండాంతరాలకు ఖ్యాతిని గడించిన కామధేనువు. సద్గురు శ్రీరాఘవేంద్రుల జయంతి, పట్టాభిషేకం పురస్కరించుకుని గురు వైభవోత్సవాలు శనివారం నుంచి కనుల పండువగా జరగనున్నాయి. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో ఆరు రోజులు వేడుకలు నిర్వహిస్తారు. శనివారం శ్రీగురుని 404వ పట్టాభిషేకం, 6వ తేదీన జయంతి ఉత్సవాలు ప్రత్యేకంగా చేస్తారు. శనివారం పాదుక పట్టాభిషేకంలో భాగంగా రాఘవేంద్రుల స్వర్ణపాదుకలకు ముత్యాలు, రత్నాలు, పుష్పాలతో అభిషేకం ఉంటాయి. వైభవోత్సవాల్లో రోజూ రాయరు పాదపూజ, సంస్థానపూజ, తీర్థప్రసాద వితరణ ఉంటుంది. శ్రీరాఘవేంద్రస్వామి గురువైభవోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మఠం ప్రాకారాలను పుష్పాలతో, విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. ఉత్సవాల్లో ప్రతి రోజూ సాయంత్రం యోగీంద్ర మంటపంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే ఊంజల మండపంలో జ్ఞానయజ్ఞ ప్రవచనాలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment