ఇంటి దగ్గరే పింఛన్ల పంపిణీ ఎక్కడా కనిపించలేదు. లబ్ధిదార
తుగ్గలి మండలం ఆర్ కొట్టాలలో వీధిలోనే పింఛన్లు పంపిణీ చేస్తున్న దృశ్యం
వీధి చివరన ఎదురుచూపు
● ఉమ్మడి కర్నూలు జిల్లాలో
అస్తవ్యస్తంగా పింఛన్ల పంపిణీ
● సచివాలయాలకు వెళ్లి నిరీక్షించినా
అందని ‘భరోసా’
● సర్వర్ సమస్యతో పింఛన్ల పంపిణీ
ప్రక్రియలో జాప్యం
● రచ్చబండల దగ్గర, చెట్ల కింద తప్పని
ఎదురుచూపులు
● తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న
అవ్వతాతలు, దివ్యాంగులు
సి.బెళగల్: మండలంలో పింఛన్ పొందేందుకు లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. శనివారం ఉదయం ఏడు గంటల అనంతరం కొంతమంది అధికారులు పింఛన్‌ను అందజేశారు. అయితే కొంతమంది అధికారులు గ్రామాలకు ఆలస్యంగా చేరుకోవడంతో లబ్ధిదారులకు ఎదురు చూపులు తప్పలేదు. అవ్వాతాతలు వీధి చివరలోని అరుగులను ఆశ్రయించారు. అధికారులు సైతం ఒకే చోట కూర్చుని అక్కడికే లబ్ధిదారులను పిలుపించుకుని పింఛన్ పంపిణీ చేశారు. మండల కేంద్రం సి.బెళగల్లో పాల కెనరా బ్యాంక్ దగ్గరున్న దుకాణం దగ్గర, తెలుగు వీధిలోని మసీద్ దగ్గర, కొంతమంది వీధి చివరన అరుగుల మీద కూర్చుని పంపిణీ చేశారు.
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో శనివారం మార్చి నెల పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. చాలా గ్రామాల్లో రచ్చబండలు, వీధుల్లోకి రప్పించి పంపిణీ చేయడం చూసి అవ్వతాతలు నోరెళ్లబెట్టారు. పడిగాపులు కాసి అతి కష్టం మీద పింఛన్లు తీసుకున్నారు. పలువురు సచివాలయ ఉద్యోగులు కొందరు ఉదయం ఏడు గంటలకే పింఛన్ లబ్ధిదారుల ఇంటి దగ్గరకే వెళ్లినా సర్వర్ సమస్య వచ్చింది. దీంతో అందరినీ ఒకేచోట పిలిపించి పంపిణీ చేపట్టారు. దివ్యాంగులు, వృద్ధులు అతి కష్టం మీద పింఛన్లు ఎక్కడ పంపిణీ చేస్తున్నారో తెలుసుకొని వెళ్లాల్సి వచ్చింది. జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా మంత్రాలయంలో, మంత్రి టీజీ భరత్ కర్నూలు నగరంలో పింఛన్లు పంపిణీ చేశారు. డీఆర్‌డీఏ పీడీ వైపీ రమణారెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో 2,38,798 పింఛన్లు ఉండగా 2,25,767 పంపిణీ చేశారు. నంద్యాల జిల్లాలో 2,15,031 పింఛన్లు ఉండగా 2,00,936 పంపిణీ చేశారు.
అంతా అస్తవ్యస్తం
పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. కల్లూరు, కోడుమూరు, సి.బెళగల్, కర్నూలు, ఆదోని తదితర ప్రాంతాల్లో ఇంటిదగ్గర పింఛన్ల పంపిణీ కేవలం నామమాత్రానికే పరిమితం అయింది. ఎక్కువ మంది సచివాలయాలకే వెళ్లి పింఛన్లు తెచ్చుకున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వలంటీర్లు లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ ఇచ్చేవారు. అవ్వాతాతలు, దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులు సంతోషం వ్యక్తం చేసేవారు. పింఛన్ల పంపిణీ వారం రోజుల పాటు కొనసాగేది. దూర ప్రాంతాల్లో ఉండేవారికి, ఆసుపత్రుల్లో చికిత్స పొందేవారికి వలంటీర్లు పింఛన్ ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వంలో ఈ పరిస్థితులు లేవు. రచ్చబండల దగ్గర, చెట్లకింద, వీధుల్లో పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. దీంతో అవ్వతాతలకు, దివ్యాంగులకు తిప్పలు తప్పడం లేదు.
తుగ్గలి: పింఛన్ లబ్ధిదారులకు ఈ నెల కూడా కష్టాలు తప్పలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నెలనెలా లబ్ధిదారుల ఇంటి వద్దకే వలంటీర్లు వెళ్లి పింఛన్ అందించేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. తుగ్గలి మండలంలోని ఆర్ కొట్టాల గ్రామంలో శనివారం మూడు చోట్ల పింఛన్లు పంపిణీ చేశారు. ఆయా ప్రాంతాల్లో వృద్ధులు, దివ్యాంగులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ప్రభుత్వ హంగామే!
పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ వీడియోను లబ్ధిదారులకు చూపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వేలాది మంది దివ్యాంగులు, వృద్ధులు వచ్చినా వారికి వెంటనే పింఛన్లు ఇవ్వలేదు. అవ్వతాతలు చాలా సమయం వేచి ఉండాల్సి వచ్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని చాలా మండలాల్లో ఇంటి దగ్గర పింఛన్ల పంపిణీ నామమాత్రంగా సాగింది.
ఇంటి దగ్గరే పింఛన్ల పంపిణీ ఎక్కడా కనిపించలేదు. లబ్ధిదార
Comments
Please login to add a commentAdd a comment