ఎన్నాళ్లీ ‘దారి’ద్య్రం! | - | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ ‘దారి’ద్య్రం!

Published Sun, Mar 2 2025 2:04 AM | Last Updated on Sun, Mar 2 2025 2:00 AM

ఎన్నాళ్లీ ‘దారి’ద్య్రం!

ఎన్నాళ్లీ ‘దారి’ద్య్రం!

‘పల్లె పండుగ’ రోడ్లు వేసినా

అందని బిల్లులు

సంక్రాతి అన్నారు..

శివరాత్రి కూడా పాయే!

రూ.55 కోట్లకు విడుదలైంది

రూ.14 కోట్లు మాత్రమే

అదే దారిలో నాబార్డు పనులు

ఆందోళనలో కాంట్రాక్టర్లు

పని పూర్తి చేసి

ఆరు నెలలైనా...

ఈ చిత్రంలో కనిపిస్తున్నది కోడుమూరు మండలం క్రిష్ణాపురం గ్రామానికి వెళ్లే రోడ్డు. 4.10 కిలోమీటర్ల ఈ రోడ్డును బాగు చేసేందుకు రూ.2.97 కోట్లు వెచ్చించారు. పని పూర్తి చేసి ఆరు నెలలు గడుస్తున్నా, నేటి వరకు కూటమి ప్రభుత్వం నయాపైసా బిల్లు విడుదల చేయలేదు. అలాగే కర్నూలు మండలం పడిదెంపాడు, పూడూరు మీదుగా కోళ్లబావాపురం వరకు (14.58 కి.మీ), రూ.11.85 కోట్లు ఖర్చు చేసి రోడ్డు నిర్మించినా, నేటి వరకు ఒక్క రూపాయ బిల్లు కూడా విడుదల కాలేదు.

కర్నూలు(అర్బన్‌): అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం రోడ్ల పనులపై హడావిడి చేసింది. పల్లె పండుగ వారోత్సవాలంటూ.. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రోడ్లకు ప్రాధాన్యతను ఇస్తున్నట్లు ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్‌ 14 నుంచి 20వ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో పల్లెల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. చేసిన పనులకు చేసినట్టుగా బిల్లులను విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ పనులన్నింటినీ సంక్రాంతి పండుగ నాటికి పూర్తి చేయాలని నిర్ణీత లక్ష్యాన్ని విధించింది. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు ఇప్పటి వరకు రూ.67.58 కోట్ల అంచనాతో చేపట్టిన మొత్తం 830 రోడ్లలో 814 రోడ్లను పూర్తి చేశారు. చేసిన పనులకు సంబంధించి ప్రభుత్వం రూ.55 కోట్లను విడుదల చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం రూ.14 కోట్లను మాత్రమే విడుదల చేసింది. సంక్రాంతి పండుగ నాటికి అన్ని రోడ్లు పూర్తి చేయాలని, బిల్లులను కూడా సకాలంలో విడుదల చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం శివరాత్రి పండుగ పోయినా కూడా బిల్లులను విడుదల చేయలేదు. పల్లెల్లో ఆయా సీసీ రోడ్ల పనులను చేపట్టిన చిన్న చితకా కాంట్రాక్టర్లు బిల్లులు ఎప్పుడు విడుదలవుతాయోనని గగ్గోలు పెడుతున్నారు.

నయాపైసా ఇవ్వకుండా..

గత ప్రభుత్వంలో అగ్రిమెంట్‌ అయి చేపట్టిన నాబార్డు పనులకు సంబంధించి కూటమి ప్రభుత్వం నేటి వరకు నయాపైసా బిల్లులను చెల్లించలేదు. జిల్లాకు మొత్తం నాబార్డు కిందరూ.61.40 కోట్లతో మొత్తం 12 పనులు ( 98.09 కిలోమీటర్లు ) చేపట్టారు. ఈ పనుల్లో ఇప్పటి వరకు రెండు పనులు పూర్తి కాగా, మిగిలిన 10 పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. 12 పనులకు సంబంధించి రూ. 38.13 కోట్ల పనులను పూర్తి చేశారు. అయితే ఈ పనులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి బిల్లులు విడుదల కాకపోవడం వల్ల ఆయా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనుల్లో కోడుమూరు మండలం క్రిష్ణాపురం, కర్నూలు మండలం కేజీ రోడ్డు నుంచి కళ్లబావాపురం వయా పడిదెంపాడు, పూడు రు రోడ్ల పనులు పూర్తి కాగా, మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. పనులను పూర్తి చేసిన వారితో పాటు వివిధ దశల్లో పనులను చేస్తున్న కాంట్రాక్టర్లు సైతం బిల్లుల విడుదలలో జరుగుతున్న జాప్యం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement