ఆధ్యాత్మిక ‘నెల’వంక
నేటి ఇఫ్తార్:
6.31
రేపటి సహెరీ:
5.13
సాశ్రీశ్రీ
ఉశ్రీశ్రీ
కర్నూలు కల్చరల్: ముస్లింల పవిత్ర మాసం రంజాన్. దీంతో నెల రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్టలతో వారు పర్వదినాన్ని జరుపుకుంటారు. మానవాళికి మార్గదర్శనం చేసే ఖురాన్ సైతం ఈనెలలోనే అవతరించింది. ఎన్నో విశేషాలు కలిగిన ఈ మాసం శనివారం ఆకాశంలో నెలవంక కనిపించడంతో ప్రారంభమైంది. ‘చాంద్ దిఖ్ గయా’ అంటూ ఒకరి నొకరు ముబారక్ చెప్పుకున్నారు. తర్వాత కొద్దిసేపటికే కర్నూలులో అవుట్ పేలడంతో రాత్రి మొదటి తరావీహ్ నమాజు చేసుకున్నారు. నేటి నుంచి నెల రోజుల పాటు ఉపవాసాలు (రోజా) పాటించనున్నారు. నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైనట్లు హిలాల్ కమిటీ ప్రకటించింది.
మాసమంతా ఆధ్యాత్మిక చింతన
‘రంజాన్ మాసం’ ప్రతి ముస్లిం అల్లాహ్ నుంచి వరా లు అందుకునే సౌభాగ్యం కల్పించే నెల. కఠోర దీక్ష, చిత్తశుద్ధితో అల్లాహ్‌ను ప్రార్థించిన వారికి చక్కటి జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తుంది. అందుకే ఈ పవిత్ర మాసంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. ఉపవాసాలు ఉండడంతో పాటు రోజుకు ఐదు పూటలు నమాజు చదువుతారు. రోజూ ఖురాన్ పఠనం లేదా శ్రవణం చేస్తారు. ఇలా చేయడం ద్వారా మానసిక ప్రశాంతతోపాటు పరిహారం లభిస్తుందని ముస్లిం మత పెద్దలు చెబుతారు.
ఉచిత సహెరీకి ఏర్పాట్లు
ఉపవాస దీక్షల సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలు సహెరీ ఏర్పాట్లు చేశారు. కర్నూలు నగరంలోని లాల్ మసీదు వద్ద ఉన్న ఖూబ్‌సూరత్ మసీదులో, పెద్దమార్కెట్ వద్ద ఉన్న నూరానీ మసీదులో, ఖడక్‌పురలో ఉన్న డాక్టర్ మియా హత్తి (ఏనుగు) బీడీ ఫ్యాక్టరీలో, కొత్తపేటలో ఉన్న హజరత్ మౌలా మిష్కిన్ మసీదులో, కొత్తపేటలోని ఖా దుమియా మసీదులో, సి.క్యాంప్ సెంటర్‌లోని మామూర్ మసీదులో, అబ్బాస్ నగర్‌లోని యూ నిఖ్ స్కూల్ వద్ద ఉన్న అబ్బాస్ మసీదులో సహెరీ ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఫొటో: డి. హుస్సేన్
నేటి నుంచి రంజాన్ ఉపవాసాలు
షురూ
నెల రోజులు దైవ చింతనలో
గడపనున్న ముస్లింలు
ఉచిత సహెరీ ఏర్పాట్లు చేసిన
స్వచ్ఛంద సంస్థలు
Comments
Please login to add a commentAdd a comment