నేడు ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష
కర్నూలు(అర్బన్): గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి ప్రవేశాలకు ఎంట్రెన్స్ టెస్ట్ ఈ నెల 2న నిర్వహిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి కె.తులసీదేవి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. పరీక్షకు జిల్లాకు చెందిన 41 మంది బాల బాలికలు దరఖాస్తు చేసుకున్నారని, వీరందరికి స్థానిక బి.క్యాంప్‌లోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు.
రేపటి నుంచి ఓపెన్ ఇంటర్ పరీక్షలు
కర్నూలు సిటీ: జిల్లా సార్వత్రిక విద్యా పీఠం(ఓపెన్) ఇంటర్మీడియెట్ పరీక్షలు సోమవారం నుంచి నిర్వహించనున్నట్లు డీఈఓ ఎస్.శ్యామూల్ పా ల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యాసకులు https://www.apopen school.ap.gov.in అనే వెబ్‌సైట్ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకొని స్టడీ సెంటర్ కో–ఆర్డినేటర్ సంతకం చేయించుకోవాలన్నారు. పరీక్షలకు 9 కేంద్రాలు ఏర్పాటు చేయగా 1,239 మంది అభ్యాసకులు హాజరవుతున్నారన్నారు. అభ్యాసకుల అనుమానాల నివృత్తికి డీఈఓ ఆఫీస్‌లో 9966562862, 9398128893 నెంబర్లతో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామన్నారు.
అగ్నిమాపక సిబ్బంది యూనిఫాంలో మార్పులు
కర్నూలు: అగ్నిమాపక శాఖలో లీడింగ్ ఫైర్‌మెన్, డ్రైవర్, ఆపరేటర్, ఫైర్‌మెన్‌ల యూనిఫాంలో స్వల్ప మార్పు చేశారు. ఆయా హోదాల్లోని ఉద్యోగులు నేవీ బ్లూ కలర్ క్యాప్(టోపీ), ఆలివ్ కొమ్మల గుర్తుతో కూడిన నలుపు రంగు బెల్టు ధరించాలని ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శనివారం అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి అవినాష్ జయసింహ చేతుల మీదుగా అందుకున్న నూతన యూనిఫాంను సిబ్బంది ధరించారు. కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ సంక్షేమ సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు, కర్నూలు కేంద్ర ప్రతినిధి చింతల రామాంజనేయులు, లీడింగ్ ఫైర్‌మెన్లు వెంకటరాముడు, నరేష్ కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్‌బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలున్న ప్రజలు వినతులను సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment