ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్లతో ఆలయాల్లో పూజలు చేయించుకుని మొదటి సంవత్సర పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల రాకతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి కనిపించింది. ఉదయం 8.15 గంటల నుంచే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. నిర్దేశించిన సమయం 9 గంటలలోపే పరీక్షలు మొదలయ్యాయి. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఎనిమిది రూట్లలో అదనపు రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పించారు. కేంద్రాల దగ్గర ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 144 సెక్షన్ అమలు చేశారు. శనివారం మొదటి సంవత్స విద్యార్థులు జనరల్ విభాగం విద్యార్థులు 21,462 మందికిగాను 20,984 మంది హాజరై 478 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగానికి చెందిన విద్యార్థులు 2,293 మందికిగాను 2,160 మంది హాజరుకాగా 133 మంది గైర్హాజరయ్యారు. ఆర్‌ఐఓ గురవయ్యశెట్టి, డీవీఈఓ వై.పరమేశ్వరరెడ్డి, స్పెషల్ ఆఫీసర్.. పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
తొలి రోజు 611 మంది విద్యార్థుల
గైర్హాజరు
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment