గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
అవుకు: మండల పరిధిలోని మారుమడుగుల గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన లక్ష్మికాంత్ రెడ్డి ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి గ్యాస్ లీకై మంటలు చేలరేగాయి. దీంతో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అగ్ని ప్రమాదంలో రూ.5 లక్షలు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వాపోయారు.
పీజీ పరీక్షలో కేఎంసీ
విద్యార్థుల ప్రతిభ
● రాష్ట్రస్థాయిలో మొదటి మూడు ర్యాంకులు కై వసం
కర్నూలు(హాస్పిటల్): డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన పీజీ వార్షిక పరీక్షలో కర్నూలు మెడికల్ కాలేజి జనరల్ సర్జరీ విభాగం వైద్య విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరిచి మొదటి మూడు ర్యాంకులు కై వసం చేసుకున్నారు. వీరిలో మొదటి ర్యాంకును డాక్టర్ డి.విష్ణుశ్రీకర్‌రెడ్డి 800 మార్కులకు 613, రెండో ర్యాంకును డాక్టర్ ఎ.తేజేశ్వర్‌రెడ్డి 610 మార్కులను, మూడో ర్యాంకును డాక్టర్ పి.వెంకటశివనాగజ్యోతి 602 మార్కులను సాధించారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు అభినందించారు. ఒకే మెడికల్ కాలేజీ విద్యార్థులు మొదటి మూడు ర్యాంకులు సాధించడం రికార్డు అని జనరల్ సర్జరీ ప్రొఫెసర్, హెచ్‌ఓడీ డాక్టర్ పి.హరిచరణ్ తెలిపారు.
గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
Comments
Please login to add a commentAdd a comment