యాగంటిలో శివదీక్ష విరమణ
బనగానపల్లె రూరల్: మండల పరిధిలోని యాగంటి ఉమామహేశ్వర స్వామి సన్నిధిలో శివమాలధారుల దీక్ష విరమణ శనివారం ఘనంగా జరిగింది. వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి శివ దీక్ష విరమణ గావించారు. ముందుగా పాతపాడు గ్రామం నుంచి తనయుడు శివ నరసింహారెడ్డి, మరికొందరు శివస్వాములతో కలిసి ఇరుముడులు తలపై పెట్టుకొని శివనామస్మరణ గావిస్తూ పాదయాత్రగా యాగంటి క్షేత్రానికి చేరుకున్నారు. కుటుంబ సమేతంగా శివపార్వతులకు ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించి దీక్ష విరమించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, సాయి ప్రసాదరెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ తోట బుచ్చిరెడ్డి, కాటసాని తిరుపాల్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం శ్రీ ఉమామహేశ్వర నిత్యాన్నదాన సంస్థ ద్వారా భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment