కర్నూలు(అర్బన్): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాల్మీకి/ బోయలకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలనే ప్రధాన డిమాండ్‌పై సోమవారం ఉదయం 11.30 గంటలకు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మొలగవెళ్లి రామాంజనేయులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాల్మీకి/ బోయలకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించేందుకు పార్లమెంట్‌లో చట్టం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా జిల్లా నలుమూలల నుంచి వాల్మీకులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment