
వినికిడి సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు
చెవిలో సమస్య వచ్చిన వారు నిర్లక్ష్యం చేయకూడదు. వైద్యులను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలి. చెవి సమస్యలను నిర్లక్ష్యం చేస్తే కొన్నిసార్లు అవి వినికిడి లోపానికి దారి తీసే ప్రమాదం ఉంది. ఉదాహరణకు చిన్నపిల్లల్లో దగ్గు, జలుబు వచ్చినప్పుడు చెవి బ్లాక్ అవుతుంది. దానివల్ల కొన్నిసార్లు వినికిడి సమస్య రావచ్చు. చెవిలో రంధ్రం పడితే మైరింగోప్లాస్టీ ఆపరేషన్ చేస్తాం. పెద్దల్లో నరాల బలహీనత వల్ల వినికిడి సమస్య వస్తుంది. వీరికి ఆడియోమెట్రీ పరీక్ష చేసి మందులు వాడాల్సి ఉంటుంది. తగ్గకపోతే హియరింగ్ ఎయిడ్ వాడాల్సి వస్తుంది.
– డాక్టర్ వై. ప్రవీణ్‌కుమార్,
ఈఎన్‌టీ వైద్యులు, కర్నూలు
సరైన హియరింగ్ ఎయిడ్ వాడాలి
వినికిడి సమస్య ఉన్న వారు అవసరమైన చికిత్సను పొందకపోయినా, వినికిడి మిషన్‌ను ఉపయోగించకపోయినా, ఎక్కువగా సెల్‌ఫోన్ రేడియేషన్, శబ్దకాలుష్యానికి గురైనా వారి వినికిడి సామర్థ్యం మరింత క్షీణిస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత పూర్తిగా వినికిడి శక్తి కోల్పోతారు. సరైన హియరింగ్ ఎయిడ్, లిజనింగ్ ట్రైనింగ్ ద్వారా వినికిడి లోపం తగ్గించవచ్చు. బ్యాలెన్స్ సమస్యను బ్యాలెన్స్ థెరపి సహాయంతో పరిష్కరించవచ్చు. వినికిడి సమస్య ఉన్న వారు ఆడియాలజిస్టును సంప్రదిస్తే పరీక్షించి అవసరమైన పరికరాన్ని అమరుస్తారు. మిషన్లు పెట్టుకోవడానికి నామోషీ పడేవారికి చెవిలోపల కూడా అమర్చే మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. – రోజా బంగి, ఆడియాలజిస్టు, కర్నూలు

వినికిడి సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు
Comments
Please login to add a commentAdd a comment