బేతంచెర్ల: మండల పరిధిలోని ముసలాయిచెర్వు గ్రామంలో గత నెల 25వ తేదీన జరిగిన హత్యా యత్నం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. సీఐ వెంకటేశ్వరరావు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు. ముసలాయి చెర్వుకు చెందిన పల్లె రాములమ్మ, కొడుకు మహేశ్వర్‌రెడ్డి పొలం గట్టు విషయంలో పాత కక్షలు మనసులో పెట్టుకొని అదే గ్రామానికి చెందిన కుంచె రామేశ్వర్‌రెడ్డి, కొడుకు సుదర్శన్‌రెడ్డిపై కత్తితో దాడి చేసి గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మండలంలోని రంగాపురం గ్రామంలో ఇద్దరు నిందితులు ఉన్నారనే సమాచారం మేరకు దాడి చేసి అరెస్టు చేశారు. డోన్ కోర్టులో హాజరు పరుచగా రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. నిందితుల ను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులు గురుబాబు, శ్రీను, దస్తగిరి, రాజు నాయక్, సురేష్ కుమార్, వెంకటేష్‌ను సీఐ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment