కర్నూలు(అగ్రికల్చర్): విలీనం తర్వాత అతి పెద్ద బ్యాంకుగా అవతరించనున్న ఆంధప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించే విధంగా ప్రభుత్వాన్ని కోరుతామని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రామకృష్ణ అన్నారు. ఆదివారం ఏపీజీబీ అధికారుల సంఘం ప్రతినిధులు బీజేపీ జిల్లా అధ్యక్షుడిని కలసి వినతిపత్రం సమర్పించారు. ప్రధాన కార్యాలయాన్ని కడపకు తరలించడం ద్వారా కలిగే నష్టాలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి కోరుతామని తెలిపారు. ఆర్థిక శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కూడా ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించాల్సి ఉందని తెలిపారు. అభివృద్ధి మొత్తాన్ని ఆమరావతిలోనే కేంద్రీకృతం చేస్తే ప్రాంతీయ విభేదాలు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ఏపీజీబీ అధికారుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment