ప్చ్.. వినపడటం లేదు..!
వినికిడి సమస్యకు కారణాలు
● ధ్వని ఎక్కువగా ఉండే పరిసరాల్లో
ఉండటం
● మొబైల్, బ్లూటూత్, హెడ్‌ఫోన్‌లలలో
పెద్దశబ్దంతో మ్యూజిక్ వినడం
● వాహనాల శబ్దాలు ఎక్కువగా వచ్చే
ప్రాంతాల్లో ఎక్కువసేపు ఉండటం
● జన్యుకారణాలు, పుట్టుకతో
వచ్చే లోపాలు
● మేనరికం, వంశపారంపర్యంగా రావడం
● వృద్దాప్యం, చెవి మధ్యలో ఇన్‌ఫెక్షన్
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● చెవి శుభ్రతకు బడ్స్,
పిన్ను సూదులు తదితరాలు ఉపయోగించకూడదు.
● చెవిలో నొప్పికి నూనె,
ఆకుపసర్లు
వేయకూడదు.
● చెవిలో చీము కారుతుంటే స్విమ్మింగ్
చేయకూడదు.
● చెవిలో నీరు పోకుండా నూనె అంటిన
దూదిని చెవిలో పెట్టుకోవాలి.
● ఎక్కువ శబ్దాలు వచ్చే ప్రదేశంలో పనిచేసే
వారు ఇయర్ ప్లగ్స్ వాడాలి.
● ప్రతి ఆరు నెలలకు ఒకసారి వినికిడి పరీక్ష
చేయించుకోవడం మంచిది.
● బ్లూటూత్, హెడ్‌ఫోన్లతో వినికిడి సమస్య
● పెద్దగా మ్యూజిక్ వినడంతో
ఇబ్బందులు
● కొందరికి పుట్టుకతో వినికిడి లోపం
● పరిష్కారం చూపుతున్న ఆధునిక
హియరింగ్ ఎయిడ్‌లు
● నేడు ప్రపంచ వినికిడి సమస్య
అవగాహన దినం
కర్నూలు(హాస్పిటల్): స్మార్ట్ ఫోన్ అధిక వినియోగం ఎన్నో అనర్థాలకు దారి తీస్తోంది. ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వినికిడి సమస్య బాధితులు పెరుగుతున్నారు. ఎక్కువ సమయం ఫోన్‌లో మాట్లాడటం, అధిక శబ్దంతో పాటలు వినడం, బ్లూటూత్, హెడ్‌సెట్ వినియోగించడం తదితర కారణాలతో వినికిడి సమస్య ఏర్పడి బాధితులు అవస్థలు పడుతున్నారు. ఎదుటి వారు చెప్పేది సరిగా వినిపించకపోతే తలెత్తే సమస్య అంతా ఇంతా కాదు. వినికిడి సమస్యను అధిగించేందుకు ఏటా మార్చి 3న ప్రపంచ వినికిడి సమస్య అవగాహన దినాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లాలో వినికిడి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. ఐదేళ్ల క్రితం జిల్లాలో వీరి సంఖ్య 4వేల దాకా ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య 5 వేలు దాటిందని వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటు పాక్షికంగా సమస్య ఉన్న వారి సంఖ్య ఇందుకు మూడింతలు ఉంటుందని వారి అంచనా. కర్నూలుతో పాటు ఆదోని, ఎమ్మిగనూరులలో చెవి, ముక్కు, గొంతు (ఈఎన్‌టి ) వైద్యుల వద్దకు చెవిలో ఇబ్బందులతో రోజుకు సగటున 250 నుంచి 300 మంది వస్తుండగా అందులో వినికిడి సమస్యతో బాధపడే వారు 40 శాతానికి పైగా ఉంటున్నారు. ఇలాంటి వారు సరిగ్గా వినపడని కారణంగా శారీరక, మానసిక సమస్యలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్య కొందరికి పుట్టుకతో వస్తుండగా మరికొందరికి ప్రమాదాల్లో సమస్య ఏర్పడుతోంది.
సమస్యను పరిష్కరిస్తున్న వినికిడి మిషన్లు
ఆధునిక టెక్నాలజీతో కంప్యూటరైజ్డ్ వినికిడి మిషన్లు వచ్చాక చాలా మంది వాటిని వాడటం సులభంగా మారింది. వీటిని వైద్యులు చెవిలోపల, చెవి వెనుక కనిపించకుండా అమరుస్తారు. ఇవి వాడటం వల్ల మనకు ఎంత వినికిడి శక్తి కావాలో అంతే తీసుకుంటుంది. నాయిస్ రిడక్షన్ ఆప్షన్ ఉండటం, అడ్వాన్స్ టెక్నాలజీ రిమోట్ కంట్రోల్ హియరింగ్ ఎయిడ్స్ ద్వారా మనం ఎంత సౌండ్ కావాలో ఈ టెక్నాలజి ఉపయోగపడుతుంది. పుట్టుకతోనే వినికిడి సమస్య ఉన్న పిల్లలకు వినికిడి మిషన్లు అమర్చి స్పీచ్‌థెరపీ ఇప్పిస్తే వారు త్వరగా మాటలు వినడమే గాక అర్థం చేసుకుని తిరిగి మాట్లాడేందుకు సులభం అవుతుంది. వినికిడి మిషన్ వాడటం వల్ల చిన్నశబ్దాలు, మాటలు మొదలుకొని దూరం నుంచి వచ్చే శబ్దాలు, మాటలు చక్కగా వినగలరు. ఉన్న వినికిడి లోపం పెరగకుండా కాపాడుకోగలరు. చెవిలో నుంచి శబ్దం తగ్గుతుంది.
వినికిడి పరీక్ష ఇలా చేయించుకోవాలి
వినికిడి సమస్య ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే ఈఎన్‌టీ వైద్యులు, ఆడియాలజిస్టు వద్దకు వెళ్లి ఆడియోమెట్రి పరీక్ష చేయించుకోవాలి. దీనివల్ల ఎంత శాతం వినికిడి కోల్పోయింది. ఎందువల్ల అని నిర్దారణ అయితే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆడియోమెట్రిక్ పరీక్ష చేయించుకున్న తర్వాత సెన్సార్ హియరింగ్ లాస్ అయితే వినికిడి మిషన్, హియరింగ్ ఎయిడ్ తప్పనిసరిగా వాడాలి. దీనివల్ల చిన్న శబ్దాలు, మాటలు మొదలుకొని దూరం నుంచి వచ్చే శబ్దాలు, మాటలు చక్కగా వినిపిస్తాయి. ఉన్న వినికిడి లోపం పెరగకుండా కాపాడుకోవచ్చు.
ప్చ్.. వినపడటం లేదు..!
Comments
Please login to add a commentAdd a comment