ప్రముఖ విద్యావేత్త రాయసం రత్నస్వామి మృతి
వెలుగోడు: ప్రముఖ విద్యావేత్త, వెలుగోడు గ్రామ నివాసి డాక్టర్ రాయసం రత్న స్వామి (90) ఆదివారం స్వగృహంలో వయోభారంతో కన్నుమూశారు. వెలుగోడులో అనేక విద్యాసంస్థలకు సారథ్యం వహించిన ఈయన నీలం సంజీవరెడ్డి డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. సర్దార్ పటేల్ ఐటీఐను స్థాపించారు. ముస్లిం మైనార్టీల కోరిక మేరకు స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో స్థానికంగా ఉర్దూ కళాశాల స్థాపించారు. సామాజిక సేవలో భాగంగా రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీని ఏర్పాటు చేసి తన సేవలను జిల్లా వ్యాప్తంగా అందించారు. అలాగే వృద్ధాప్య ఆశ్రమాన్ని స్థాపించి వృద్ధులకు వసతి కల్పించారు. అవివాహితుడైన రత్న స్వామి మృతి విషయం తెలియగానే గ్రామస్తులు, విద్యావేత్తలు, మేధావులు సంతాపం తెలియజేశారు.
స్నేహితుడి కుటుంబానికి చేయూత
గోనెగండ్ల: అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి స్నేహితులు అండగా నిలిచారు. లక్షరూపాయలు సాయం అందజేసి గొప్ప మనసును చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే..గోనెగండ్లలోని శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన పూజారి ఒంకార్ (48)కు భార్య పూజారి లత, కూతురు, కుమారుడు ఉన్నారు. మోటర్ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించే ఈయనకు వారం రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు పెంచికల పాడు ఆసుపత్రిలో చేర్పించగా కోలుకోలేక ఆదివారం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న గోనెగండ్ల జెడ్పీ హైస్కూల్ 1992–93 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థులు, మెకానిక్ యూనియన్ సభ్యులు ఒంకార్ స్వగృహానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రూ. లక్ష సాయం అందజేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ప్రముఖ విద్యావేత్త రాయసం రత్నస్వామి మృతి
Comments
Please login to add a commentAdd a comment