కర్నూలు(అగ్రికల్చర్): మోతాదుకు మించి పురుగు మందులు పిచికారీ చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని ఇన్‌పుట్ డీలర్లను ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీలత సూచించారు. కలెక్టరేట్‌లోని వ్యవసాయ శాఖ సమావేశ మందిరంలో ఆదివారం ఇన్‌పుట్ డీలర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మ డీపీడీ మాట్లాడుతూ.. పురుగుమందులు ఎక్కువగా వాడుతుండటంతో ఆహార పంటలు, కూరగాయల్లో వాటి అవశేషాలు ఉంటున్నట్లు స్పష్టమవుతోందన్నారు. విశ్రాంత జేడీఏ, దేశీ శిక్షణ కార్యక్రమం సమన్వయకర్త జయచంద్ర పాల్గొన్నారు.
నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ నిధులు దుర్వినియోగం చేశారని ఆ సంఘం కోశాధికారి భాస్కరనాయుడు, మరి కొందరు కార్యవర్గ సభ్యుల ఫిర్యాదు చేశారు. సంఘం తాలూకా కార్యవర్గాల ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా నాయకత్వం ఏకపక్షంగా ముందుకు పోతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కేవీ శివారెడ్డి, ఎ.విద్యాసాగర్ చర్యలు చేపట్టారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు తాలూకా ఎన్నికలు జరుపవద్దని, సంఘం నిధుల దుర్వినియోగంపై వస్తున్న ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని జిల్లా నాయకత్వాన్ని ఆదేశించారు. అలాగే జిల్లా సంఘంలో వైస్ ప్రెసిడెంటుగా ఉన్న ఆర్‌వీ రమణ.. జిల్లా నాయకత్వంపై పలు విమర్శలు చేశారు. సంఘం ఆదాయాన్ని స్వాహా చేస్తున్నారని పేర్కొంటూ 21 అంశాలపై ఆరోపణలు చేస్తూ పత్రిక ప్రకటన విడుదల చేశారు. వీటిని రాష్ట్ర నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment