ఊరు అడుగుతోంది నీరు
ఆస్పరి: మంచినీరు అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిందె నీటికి రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. ఆస్పరి మండలంలోని చిన్నహోతూరు, జొహరాపురం గ్రామాల్లో రేగడి పొలాలు ఉన్నాయి. ఎక్కడ బోర్లు వేసినా ఫ్లోరైడ్ నీరే పడుతోంది. దీంతో బాపురం రిజర్వాయర్ నీటి కోసం వేచి ఉండాల్సిన పరిస్ధితి నెలకొంది. జొహరాపురంలో 7,000, చిన్నహోతూరులో 4,000 మంది ప్రజలు ఉన్నారు. రెండు గ్రామాల్లో మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కాలేదు. వేసవి కాలం వచ్చిందంటే వారికి కష్టాలు తప్పడం లేదు. జొహరాపుర గ్రామస్తులు నేటికీ వక్కిరేణి నీటినే తాగుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బాపురం రిజర్వాయర్ నుంచి 15 రోజులకోసారి వచ్చే నీటి కోసం రెండు గ్రామాల ప్రజలు రాత్రింబవళ్లు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు గ్రామాలకు బాపురం రిజర్వాయర్ నీటిని పైపులైన్ ద్వారా అందిస్తున్నారు. రెండు గ్రామాలకు పై భాగంలో ఉన్న పల్లెవారు పట్టుకున్న తర్వాత నీటిని వదులుతున్నారు. తమ గ్రామాలకు బాపురం రిజర్వాయర్ నుంచి నేరుగా పైపులైన్ వేస్తే బాగుంటుందని చిన్నహోతూరు, జొహరాపురం గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.
రెండు రోజులకోసారి నీటిని
సరఫరా చేస్తున్నాం
మండలంలోని చిన్నహోతూరు, జొహరాపురం గ్రామాలకు రెండు రోజులకోసారి బాపురం రిజర్వాయర్ నీటిని సరఫరా చేస్తున్నాం. అయితే గ్రామాల్లో పంచాయతీ వారు విడతలు వారీగా ఒక్కో కాలనీకి ఒక్క రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. చివర కాలనీలకు నీరు వచ్చేలోపు ఆలస్యమవుతుండొచ్చు. పందికోన రిజయర్వాయర్ నుంచి ఆస్పరి మండలంలోని జొహరాపురం, చిన్నహోతూరు, ఆస్పరి, శంకరబండ, చిరుమాన్‌దొడ్డి, హలిగేర, బిణిగేర, చిగిళి, నగరూరు గ్రామాలకు శాశ్వతంగా మంచి నీటి పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీతో సర్వే చేయిస్తోంది. – హనుమంతు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ
పెద్దల కాలం నుంచి తిప్పలే
పెద్దల కాలం నుంచి మంచి నీటి కోసం అవస్థలు తప్పడం లేదు. మా ఎస్సీ కాలనీకి 15 రోజులకోసారి బాపురం రిజర్వాయర్ నీరు వచ్చినా చాలడం లేదు. తప్పని సరి పరిస్థితులలో వర్షాధారంతో నిండిన వక్కిరేణి నీటినే నేటికీ తాగుతున్నాం. ఏప్రిల్, మే నెలలో అయితే వక్కిరేణిలో నీరు పూర్తిగా అడుగంటి పోతుంది. బు రద నీరు ఉన్నా దానినే తాగుతున్నాం. హంద్రీ నీవా నీటిని మా సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి.
– కరుణాకర్, జొహరాపురం గ్రామం,
ఆస్పరి మండలం
పైపులైన్ మార్చాలి
బాపురం రిజర్వాయర్ నుంచి మా గ్రామానికి 50 ఏళ్లు క్రితం పైపులైన్ వేశారు. పాత పైపులైన్ మార్చి కొత్తగా వేయాలి. అంతేగాక పెద్దహోతూరు నుంచి కాకుండా నేరుగా పైపులైన్ వేస్తే నీటి సమస్య కొంత వరకు తీరుతుంది. మాగ్రామంలో ఎక్కడ బోర్లు వేసినా ఫ్లోరైడ్ నీరే పడుతుంది. అధికారులు మా గ్రామానికి శాశ్వతంగా మంచి నీటి సమస్య పరిష్కారం చే యాలి. – హరికృష్ణ, చిన్నహోతూరు సర్పంచ్,
ఆస్పరి మండలం
బాపురం రిజర్వాయర్ నీరే గతి
చిన్నహోతూరు, జొహరాపురం
గ్రామాల్లో అవస్థలు
ఊరు అడుగుతోంది నీరు
ఊరు అడుగుతోంది నీరు
ఊరు అడుగుతోంది నీరు
Comments
Please login to add a commentAdd a comment