ప్రశాంతంగా ‘ఏకలవ్య’ ప్రవేశ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ‘ఏకలవ్య’ ప్రవేశ పరీక్ష

Published Mon, Mar 3 2025 1:48 AM | Last Updated on Mon, Mar 3 2025 1:49 AM

ప్రశా

ప్రశాంతంగా ‘ఏకలవ్య’ ప్రవేశ పరీక్ష

కర్నూలు(అర్బన్‌): గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఏకలవ్య మోడల్‌ స్కూల్స్‌లో 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించి ఆదివారం పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి కే తులసీదేవి తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి స్థానిక బీ క్యాంప్‌లోని ఏపీటీడబ్ల్యూఆర్‌ (బాలికలు) స్కూల్‌లో ఈ పరీక్షను నిర్వహించామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ పాఠశాలల్లో ప్రవేశాలకు కర్నూలు జిల్లా నుంచి 42 మంది బాల బాలికలు దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరిలో ఎంట్రెన్స్‌ టెస్ట్‌కు బాలురు 30 మందికి గాను 19 మంది, బాలికలు 12 మందికి గాను 9 మంది హాజరు అయ్యారన్నారు. మిగిలిన 14 మంది పరీక్షకు హాజరు కాలేదని తెలిపారు.

‘ఎకై ్సజ్‌’ సంఘం అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్‌

కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ ఎగ్జిక్యూటీవ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడిగా కర్నూలుగా ఈఎస్‌టీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ ఎన్నికయ్యారు. ఆదివారం కర్నూలు ఎకై ్సజ్‌ కార్యాలయం ఆవరణలో జిల్లా డీపీఈఓ మచ్చా సుధీర్‌బాబు అధ్యక్షతన ఎన్నిక లు జరిగాయి. అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా సోమశేఖర్‌ (డోన్‌ ఎస్‌ఐ), ఉపాధ్యక్షులుగా బార్గవ్‌రెడ్డి (కోసిగి ఎస్‌ఐ), ప్రధాన కార్యదర్శిగా సందీప్‌ (కోవెలకుంట్ల ఎస్‌ఐ), ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా రమేష్‌రెడ్డి (ఎమ్మిగనూరు సీఐ), సహాయ కార్య దర్శిగా రహెనాబేగం (కర్నూలు ఎస్‌ఐ), కోశాధికారిగా దుర్గా నవీన్‌బాబు (కర్నూలు ఎస్‌ఐ), కార్యవర్గ సభ్యులుగా ఇన్‌స్పెక్టర్లు శ్రీధర్‌, రమాదేవి, శేషాచలం, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు ప్రవీణ్‌కుమార్‌ నాయక్‌, ఇంద్ర కిరణ్‌ తేజ ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి సుధీర్‌బాబు, ఏఈఎస్‌ రామకృష్ణారెడ్డి తెలిపారు.

ఆధ్యాత్మిక భావం అలవర్చుకోవాలి

ఆళ్లగడ్డ: సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావం అలవర్చుకోవాలని అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీ రంగరాజ యతీంత్ర మహాదేశికన్‌ స్వామీజీ అన్నారు. అహోబిలం క్షేత్రంలో ఇస్కాన్‌ ఇండియా యూత్‌ కౌన్సిల్‌ (ఐఐవైసీ) సమావేశాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఆదివారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీఠాధిపతి ప్రసంగిస్తూ.. నేటి యువత ఆధ్యాత్మిక భావనలు కలిగి ఉండి రేపటి తరానికి ఆదర్శంగా నిలవాలన్నారు. అహోబిలం క్షేత్రం చరిత్ర, ప్రాశస్త్యం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మఠం ప్రతినిధి శ్రీకార్యం, ప్రధానార్చకులు వేణుగోపాలన్‌ పాల్గొన్నారు.

సైక్లింగ్‌తో ఆరోగ్యం

కర్నూలు (టౌన్‌): ‘ప్రతి రోజు కొంత సమయాన్ని కేటాయించి సైక్లింగ్‌ చేద్దాం.. ఆరోగ్యంగా ఉందాం’ అంటూ జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, శాయ్‌ (స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) సెంటర్‌ ఆధ్వర్యంలో కర్నూలులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్‌డీవో మాట్లాడుతూ ఆరోగ్య భారత్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఫిట్‌ ఇండియా కార్యక్రమం దేశ వ్యాప్తంగా నిర్వహిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో సైక్లింగ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రశాంతంగా ‘ఏకలవ్య’ ప్రవేశ పరీక్ష 1
1/2

ప్రశాంతంగా ‘ఏకలవ్య’ ప్రవేశ పరీక్ష

ప్రశాంతంగా ‘ఏకలవ్య’ ప్రవేశ పరీక్ష 2
2/2

ప్రశాంతంగా ‘ఏకలవ్య’ ప్రవేశ పరీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement