ఘనంగా గురు వైభవోత్సవాలు
మంత్రాలయం: ప్రహ్లాదరాయల వరదుడు.. యతి వరేణ్యుడు శ్రీరాఘవేంద్ర స్వామి గురు భక్తి వైభవోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. రెండో రోజు ఆదివారం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో వేకువ జామున సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పూజా మందిరంలో పీఠాధిపతి చేపట్టిన మూల, జయ, దిగ్విజయ రాముల సంస్థాన పూజలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వేద మంత్రోచ్ఛారణలు, భక్తి కీర్తనలు, మంగళవాయిద్యాల మధ్య అర్చన, అభిషేకాది పూజలు, దివిటీ సేవలు నిర్వహించారు. అనంతరం రాఘవేంద్రుల మూల బృందావనానికి పంచామృతాభిషేకం గావించి పుష్పాలంకరణ చేపట్టి హారతులు పట్టారు. వేడుకల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది. పూజోత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక చింతనలో ముంచింది.
అనుగ్రహ ప్రశస్థి అవార్డులు
వేడుకల సందర్భంగా యోగీంద్ర మంటపంలో కర్ణాటక రేల్వే సహాయక మంత్రి సోమన్న రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్థి అవార్డు అందుకున్నారు. అదే మంటపంలో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బెంగళూరుకు చెందిన విదూషి అదితి నారాయణ కర్ణాటక సంగీత విభావరి, బెంగళూరుకు చెందిన కడప హనుమేష్ ఆచార్ వీణానాద ప్రదర్శన అలరించాయి. ఉత్సవాల్లో ఏఏవో మాధవశెట్టి, సలహాదారు శ్రీనివాసరావు, మేనేజర్ వెంకటేష్‌జోషి, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, మేనేజర్–సి సురేష్ కోనాపూర్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, సంస్కృత విద్యాపీఠం ప్రధానాచార్యులు వాదీరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు.
ఘనంగా గురు వైభవోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment