ఎస్టీ రిజర్వేషన్ కోసం వాల్మీకుల పోరాటం
కర్నూలు(సెంట్రల్): వాల్మీలకు ఎస్టీ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తామని వీఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దూరు సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు. సోమవారం వీఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో ఎస్టీ రిజర్వేషన్ సాధన కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం తెలిపేలా సీఎం చంద్రబాబునాయుడు కృషి చేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు టీడీపీ నాయకులు.. వాల్మీలకు ఎస్టీ రిజర్వేషన్ అవకాశాన్ని కల్పించాలన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వాలే ఉండటంతో ఎస్టీ రిజర్వేషన్ సాధన సులభతరం అవుతుందన్నారు. వీఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో 18 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. వాల్మీకుల ఆశలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతూనే ఉందన్నారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, నాయకులు కాశీం నాయుడు, మురళీ నాయుడు, రాఘవేంద్ర పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా
Comments
Please login to add a commentAdd a comment