శాస్త్రోక్తంగా సెల్వర్ కుత్తు ఉత్సవం
ఆళ్లగడ్డ: అహోబిలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎగువ అహోబిలం క్షేత్రంలో సెల్వార్ కుత్తు ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారం నుంచి అహోబిలేశుడి వివాహ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నిత్య పూజల అనంతరం ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీ జ్వాలా నరసింహస్వామి ఉత్సవమూర్తిని పల్లకీలో కొలువుంచి దేవాలయం ఎదురుగా ఉన్న ధ్వజ స్తంభం వద్దకు తోడ్కొని వచ్చారు. వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో సెల్వర్ కుత్తు ఉత్సవం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment