● గత నెల 26న ఏడేళ్ల బాలిక మృతి ● చికిత్స పొందుతున్న మరో
● గోనెగండ్ల మండలంలోని కులుమాల గ్రామంలో ఇటీవల ఓ మహిళకు డెంగీ జ్వరం రావడంతో కర్నూలులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించడంతో కోలుకుంది. విషయం తెలుసుకున్న మలేరియా అధికారులు గ్రామంలో వైద్య సిబ్బందితో కలిసి అవసరమైన చర్యలు చేపట్టారు.
● పెద్దకడబూరు మండలం నౌలేకల్లు గ్రామానికి చెందిన అక్షయ(7) అనే బాలిక గత నెల 26న డెంగీ జ్వరంతో బాధపడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఇదే జ్వరం పాప అక్కలైన సిరివెన్నెల(12), సింధుప్రియ(9)లకు కూడా సోకింది. వారు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు.
చర్యలు చేపడుతున్నాం
మలేరియా సిబ్బంది ద్వారా దోమల నివారణకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. వీరితో పాటు ఆశ, ఏఎన్‌ఎంలు ఇంటింటి సర్వే నిర్వహించి జ్వరపీడితులుంటే రక్తపూతల పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో పాజిటివ్ వస్తే ఎలీసా టెస్ట్‌కు పంపిస్తున్నాం. అక్కడ కూడా పాజిటివ్ వస్తేనే డెంగీగా నిర్ధారించి నివారణ చర్యలు చేపడుతున్నాం.
–నూకరాజు, జిల్లా మలేరియా అధికారి, కర్నూలు
కర్నూలు(హాస్పిటల్): డెంగీ జ్వరం పేరు చెబితేనే దీని గురించి తెలిసిన వారితో పాటు సామాన్యులకూ వెన్నులో వణుకుపుడుతోంది. చిన్నదోమ కారణంగా వచ్చే ఈ వ్యాధి లక్షణాలతో బాధితులు ఆసుపత్రులకు వెళ్తున్నారు. రక్తంలో ప్లేట్‌లెట్లు తగ్గుతుంటే రోగుల సహాయకుల్లో మరింత ఆందోళన పెరుగుతోంది. ఎలాగైనా రోగిని ప్రాణాలతో దక్కించుకోవాలని అప్పులు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇదే సమయంలో సాధారణ జ్వరానికి సైతం కొందరు వైద్యులు, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు డెంగీ పేరుతో రోగులను దోచుకుంటున్నాయి.
కర్నూలు జిల్లా జనాభా 2024 సంవత్సర అంచనాల ప్రకారం 24.49లక్షలు. ఇందులో 12.31లక్షలు పురుషులు, 12.18లక్షలు సీ్త్రలు ఉన్నారు. వైద్యపరంగా జిల్లాలో ఒక ప్రభుత్వ, ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా బోధనాసుపత్రులున్నాయి. వీటితో పాటు ఒక ఏరియా ఆసుపత్రి, ఐదు కమ్యూనిటి హెల్త్ సెంటర్లు, ఒక మాతాశిశు సంరక్షణ కేంద్రం, 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కొత్తగా మరో 12 పీహెచ్‌సీలు, 28 అర్బన్ హెల్త్ సెంటర్లు, 502 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఉన్నాయి. వీటితో పాటు 150కి పైగా ప్రైవేటు ఆసుపత్రులు, మరో 300 దాకా క్లినిక్‌లు ఏర్పాటయ్యాయి. ఆయా ఆసుపత్రుల్లోని వైద్యుల వద్దకు సీజనల్ వారీగా ప్రతిరోజూ జ్వరపీడితులు చికిత్స కోసం వస్తుంటారు. ఒకప్పుడు వర్షాకాలంలో మాత్రమే దోమల ద్వారా వ్యాప్తి చెందే మలేరియా, డెంగీ, చికున్‌గున్యా జ్వరాలు వచ్చేవి. ఇప్పుడు ఏడాది పొడవునా ఈ కేసులు నమోదవుతున్నాయి. గతంలో చాలా అరుదుగా నమోదయ్యే డెంగీ కేసులు కాస్తా ఇప్పుడు ప్రతి నిత్యం నమోదవుతూనే ఉన్నాయి. డెంగీకి సీజన్‌తో పనిలేకుండా అన్ని సీజన్‌లలో కేసులు నమోదవుతుండటంతో అధికారులు, వైద్యుల్లోనూ ఆందోళన నెలకొంది. తాజాగా పెద్దకడుబూరు మండలం నౌలేకల్లు గ్రామంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లకు ఈ వ్యాధి సోకగా ఒక బాలిక మృతి చెందింది. దీంతో గ్రామంలో మలేరియా అధికారులు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వారానికి మించి నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు.
కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆలూరు, కోడుమూరు, మంత్రాలయం నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండల కేంద్రాలు, గ్రామా ల్లో పారిశుద్ధ్యం కొరవడింది. గత కొంత కాలంగా ఎక్కడ చూసినా మురుగునీరు నిలిచిపోవడంతో దోమలు పెరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు మురుగుకాల్వలు శుభ్రం చేయకపోవడం, అందులో వ్యర్థాలు వేయడంతో నీరు నిలిచిపోయి దోమలు పెరిగేందుకు ఆవాసంగా మారాయి. దీనికితోడు గ్రామాలు, పట్టణాల్లోని మురికివాడల్లో నీటి కొరత కారణంగా ప్రజలు నీటిని తొట్లలో నిల్వ చేసుకుంటున్నారు. నెలల తరబడి వాటిని శుభ్రం చేయకపోవడంతో అందులో లార్వా పెరిగి దోమలుగా మారు తున్నాయి. ఈ విషయమై వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అవగాహన కల్పించడంలో విఫలం అ య్యా యనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మొక్కుబడిగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
●డెంగీకారక ఏడిస్ ఈజిప్ట్ దోమ కేవలం పగలు మాత్రమే కుడుతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో శరీరాన్ని పూర్తిగా కవర్ చేసేలా దుస్తులు ధరించాలి. చిన్నపిల్లల ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి.
● దోమతెరలు, జాలీలు వాడాలి, దోమలను చంపే క్రీములు, స్ప్రేలు వాడాలి.
● ఇంటిలో, ఇంటి ఆవరణలో నీళ్ల కుండీలు, ఓవర్‌హెడ్ ట్యాంకుల్లో, బావులపై దోమలు గుడ్లు పెట్టకుండా మూతలు అమర్చాలి.
● పనికిరాని సీసాలు, డబ్బాలు, రబ్బరుటైర్లు, వాటర్ కూలర్లు వంటి పాత్రల్లో నీరు నిల్వ లేకుండా చూడాలి.
శ్రీమఠం.. శోభాయమానం
డెంగీ పేరుతో దోపిడీ
చాలా వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపతుల్లో ర్యాపిడ్ టెస్ట్ ద్వారా డెంగీ నిర్ధారణ అయిన వెంటనే లక్షణాలను బట్టి చికిత్స ప్రారంభిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ మాత్రం ర్యాపిడ్ టెస్ట్‌లో పాజిటివ్ రిపోర్ట్ వస్తే తమకు సమాచారం అందించాలని, ఈ మేరకు రక్తం సీరా తీసి కర్నూలు, ఆదోనిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎలీసా టెస్ట్ చేయించాలని చెబుతున్నారు. అక్కడి నివేదిక ఆధారంగానే డెంగీ వ్యాధిగా ఆసుపత్రులు ప్రకటించాలని చెబుతున్నారు. ఎలీసా టెస్ట్ రిపోర్టు రావాలంటే వారం, పదిరోజుల సమయం పడుతోందని, అప్పటి వరకు చికిత్స చేయకుండా ఎలాగని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అదనుగా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు మాత్రం ప్రతి సాధారణ జ్వరాన్ని డెంగీ లక్షణాలుగా పేర్కొంటూ రోగులను దోచుకుంటున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఇలా తప్పించుకోవాలి
అవగాహన కను‘మరుగు’
ఏడాది పొడవునా డెంగీ కేసులు
తీవ్రమైన తలనొప్పి, కళ్లు, కండరాలు, కీళ్లనొప్పులు ఉంటాయి. ఒంటిపై ఎర్రటి దురదలు కనిపిస్తాయి. ముక్కు, చిగుళ్లల్లో రక్తం స్రవిస్తుంది.
డెంగీ లక్షణాలు
● గత నెల 26న ఏడేళ్ల బాలిక మృతి ● చికిత్స పొందుతున్న మరో
● గత నెల 26న ఏడేళ్ల బాలిక మృతి ● చికిత్స పొందుతున్న మరో
Comments
Please login to add a commentAdd a comment