రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు
కర్నూలు(అగ్రికల్చర్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సీఎస్‌ఎస్–ఎస్‌ఎంఏఎం కింద రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రపరికరాల పంపిణీ చేయడానికి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఏ యంత్ర పరికరాలు ఇస్తారు.. యూనిట్ కాస్ట్ ఎంత, సబ్సిడీ వివరాలను వ్యవసాయ శాఖ విడుదల చేసింది. ఏపీ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏపీ ఆగ్రోస్) యంత్రపరికరాలను సరఫరా చేస్తోంది. కర్నూలు జిల్లాకు 1,660 యూనిట్లు మంజూరయ్యాయి. వీటికి సబ్సిడీ కింద రూ.2.87 కోట్లు మంజూరు చేసింది. నంద్యాల జిల్లాకు 1,635 యూనిట్లు మంజూరు చేయగా.. సబ్సిడీ రూ.2.85కోట్లు మంజూరు చేసింది. సబ్సిడీలో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరిస్తుంది. రైతులు స్థానిక రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
శాసీ్త్రయ ఆవిష్కరణలపై దృష్టి సారించాలి
కర్నూలు సిటీ: శాసీ్త్రయ నూతన ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి సారించాలని డీఈఓ ఎస్.శామ్యూల్‌పాల్ అన్నారు. జాతీయ సైన్స్ వారోత్సవాల సందర్భంగా మంగళవారం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాస్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్‌ఈ)లో జిల్లాలోని వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. ‘వికసిత్ భారత్ కోసం సైన్స్, ఆవిష్కరణలలో ప్రపంచ నాయకత్వం కోసం భారతీయ యువతకు సాధికారత’’ అనే అశంపై క్విజ్, వ్యాసరచన, పోస్టర్ ప్రదర్శన, సెమినార్ నిర్వహించారు. డీఈఓ ఎస్.శామ్యూల్‌పాల్ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. విద్యార్థులు ప్రతి అంశాన్ని పరిశోధనాత్మకంగా చదవాలని, శాసీ్త్రయతను పెంచుకోని సరికొత్త ఆవిష్కరణలను తయారు చేయాలన్నారు. విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రిన్సిపాల్ ఆర్.ఆదినారాయణ రెడ్డి, సైన్స్ కో–ఆర్డినేటర్ రంగమ్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment