టీడీపీ నేత గోడౌన్‌లో అక్రమ బియ్యం పట్టివేత
● 256 సంచుల బియ్యం సీజ్
ఆళ్లగడ్డ: పట్టణ శివారులోని టీడీపీ నేత గోడౌన్‌లో అక్రమంగా నిలువ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు సీజ్ చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు, బియ్యం డాన్‌గా పేరొందిన శివకుమార్‌పై కేసు నమోదు చేసిన ఘటన మంగళవారం నియోజవర్గంలో చర్చనీయాంశమైంది. పట్టణ శివారులోని చిన్నకందుకూరు గ్రామ రహదారిలో ఓ గోడౌన్‌ను టీడీపీ నేత బాడుగకు తీసుకుని నియోజకవర్గ వ్యాప్తంగా సేకరించిన రేషన్ బియ్యం నిల్వ ఉంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంటారని సమాచారం. ఈ క్రమంలో బుధవారం గోడౌన్‌లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమంగా నిలువ ఉంచారని పోలీసులకు సమాచారం అందడంతో డీఎస్పీ ప్రమోద్ ఆదేశాల మేరకు పట్టణ ఎస్‌ఐ నగీన నంద్యాల పౌరసరఫరాల అధికారులకు సమాచారం ఇచ్చి గోడౌన్‌పై దాడులు నిర్వహించారు. దాడుల్లో 256 సంచుల రేషన్ బియ్యం నిలువ ఉంచినట్లు గుర్తించి రేషన్ బియ్యం, గోడౌన్ సీజ్ చేశారు. నిల్వ చేసిన వ్యక్తి పట్టణానికి చెందిన శివకుమార్ అని నిర్ధారణ కావడంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నగీన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment