No Headline
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం రాఘవేంద్రస్వామి మఠంలో రాఘవేంద్రస్వామి గురు వైభవోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. మంగళవారం శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థు లు నేతృత్వంలో వేడుకలు రమణీయంగా సాగాయి. ఊంజల మంటపం వేదికగా రెండు వేల మంది గురు సార్వభౌమ సాహిత్య ప్రాజెక్టు అకాడమీ మహిళల సామూహిక పారాయణం ఆకట్టుకుంది. అలాగే యాగ మంటపంలో సంస్కృత విద్యా పీఠం విద్యార్థులకు శ్రీమన్ న్యాయసుధాపై పరీక్షలు నిర్వహించారు. బెంగళూరులోని వ్యాసరాజ మఠం విద్యా విజయ తీర్థులు, శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు సమక్షంలో పరీక్ష జరిగింది. వేడుక సందర్భంగా బళ్లారి ఎంపీ తుకారాం, విద్వాన్ కేశవాచార్యకు రాఘవేంద్రుల అనుగ్రహ ప్రశస్థి అవార్డులు ప్రదానం చేశారు.
No Headline
Comments
Please login to add a commentAdd a comment