రూ.139.90 కోట్లు
4,66,348
జిల్లాలోని గృహాల సంఖ్య
నెలకు రూ.3వేల చొప్పున చెల్లించాల్సిన నిరుద్యోగ భృతి
విద్యారంగం.. అస్తవ్యస్తం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యారంగం అస్తవ్యస్తంగా మారింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినా.. నేటి వరకు ఒక్క నయాపైసా విడుదల చేయలేదు. అదిగో, ఇదిగో డీఎస్సీ అంటూ కాలయాపన చేస్తున్నారు. ఎన్నికలకు ముందు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి.
– డీ సోమన్న, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు
విద్యార్థులకు ఆర్థిక కష్టాలు
రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయకపోవడంతో విద్యార్థులపై కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయాలన్నా, సర్టిఫికెట్లు తీసుకోవాలన్నా పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులు అనేక ఆర్థిక కష్టాలకు గురవుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదు. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి.
– అబ్దుల్లా, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు
ఉన్నత విద్య ప్రశ్నార్థకం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా నేటి వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. యువగళం పాదయాత్రలో అన్ని ఇవ్వగలం అని నమ్మించిన మంత్రి నారా లోకేష్ నేడు నోరుమెదపడం లేదు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను విడుదల చేయకుండా బకాయి పెట్టడంతో విద్యార్థుల ఉన్నత విద్య ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే విద్యార్థులతో కలసి ఉద్యమాలు చేస్తాం.
– ఆర్ చంద్రప్ప, టీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
కర్నూలు(అర్బన్): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతోంది. ఫీజు బకాయిలపై నోరు మెదపకుండా విద్యార్థుల చదువులకు చంద్రబాబు ప్రభుత్వం ఆటంకం కల్పిస్తోంది. ఫీజులు చెల్లించాలని విద్యార్థులను వివిధ కళాశాలల యాజమాన్యాలు పట్టిపీడిస్తున్నాయి. ప్రతి విద్యా సంవత్సరం నాలుగు విడతలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తోంది. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి అదే ఏడాది మార్చి 2వ తేదీన మొదటి విడతగా జిల్లాలోని 35,618 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.23.95 కోట్లను అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జమ చేసింది. మిగిలిన మూడు విడతల ఫీజును ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది.
వైఎస్సార్‌సీపీ హయాంలో ఇలా..
2017–18, 2018–19 విద్యా సంవత్సరాల్లో పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను అధికారంలోకి వచ్చిన వెంటనే 2019–20 విద్యా సంవత్సరంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విడుదల చేసింది. అప్పట్లో జిల్లాలో 32,162 మంది విద్యార్థులకు సంబంధించిన అరియర్స్ అందాయి. గతంలో కుటుంబ వార్షిక ఆదా యం రూ. లక్ష ఉండగా వీలైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరాలనే సదుద్దేశంతో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.2.50 లక్షలకు పెంచింది. ఈ నేపథ్యంలోనే వసతి దీవెన పథకం ద్వారా ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు రూ.20 వేల ప్రకారం అందించింది.
● గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టిన సమయంలో బీసీ, ఈబీసీ, మైనారిటీ, కాపు విద్యార్థుల ఇంజనీరింగ్ విద్యకు ఏడాదికి రూ.35 వేలు మాత్రమే విడుదలయ్యేవి. కానీ, కొన్ని పెద్ద కళాశాలల్లో (గ్రేడ్ –1) ఇంజినీరింగ్ ఫీజు ఏడాదికి రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఉంది. ఆయా కళాశాలల్లో చదువుతున్న సంబంధిత సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వం విడుదల చేసే రూ.35 వేలను మినహాయించి మిగిలిన ఫీజు వారి తల్లిదండ్రులే చెల్లించాల్సి వచ్చేది. ఈ ఆర్థిక భారాన్ని కూడా తొలగించేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో అడుగు ముందుకు వేసి ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని పెంచారు. దీంతో గ్రేడ్–1 కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని కూడా తగ్గించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కింది.
● ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ తదితర సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.501.60 కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేశారు.
ఘరానా మోసం
ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా విద్యార్థులను, నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోంది. రూ.3,900 కోట్ల ఫీజు బకాయిలను పెట్టి, విద్యార్థి సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో రూ.780 కోట్లను మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. నెలకు రూ.3 వేల ప్రకారం నిరుద్యోగులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.72 వేలు అప్పుపడింది. 20 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉన్నా.. ఎలాంటి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టలేదు.
– రెడ్డిపోగు ప్రశాంత్, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు
వైద్య విద్యకు మోకాలడ్డు
ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో వైద్య రంగానికి పెద్దపీట వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు నిర్మాణాలను కూడా ప్రారంభించారు. అందులో భాగంగానే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆదోని, నంద్యాల ప్రాంతాల్లో మెడికల్ కళాశాలల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. నంద్యాలలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభం కాగా, ఆదోనిలో చురుగ్గా జరుగుతున్న మెడికల్ కళాశాల నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం మోకాలడ్డువేసింది. కరువు ప్రాంతమైన ఆదోనిలో మెడికల్ కళాశాల నిర్మాణానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో దాదాపు 80 శాతం నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. మిగిలిన 20 శాతం పనులు పూర్తియితే ఈ ఏడాది 150 సీట్లతో కళాశాల ప్రా రంభయ్యేది. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిర్మాణాలకు బ్రేకులు వేసింది. దీంతో ఆదోని మెడికల్ కళాశాల కలగానే మిగిలిపోయింది.పైపెచ్చు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏర్పాటై న మెడికల్ కళాశాలలను ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు తీసుకున్న నిర్ణయం పట్ల పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
రూ.1678.85కోట్లు
అమలు చేయకపోతే ఏడాదికి నష్టం
నేడు యువత పోరు
కర్నూలు(టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహిస్తున్న యువత పోరు నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలో ఉదయం 10 గంటలకు స్థానిక గౌరి గోపాల్ ఆసుపత్రి వద్దనున్న ధర్నా చౌక్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్బావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లాలో వేడుకలు నిర్వహిద్దామని పిలుపు నిచ్చారు.
ప్రస్తుతం ఇలా..
జిల్లాలో 35,618 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, కాపు, క్రిస్టియన్ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి కూటమి ప్రభుత్వం మూడు విడతలుగా రూ.71.86 కోట్లను బకాయి పడింది.
చంద్రబాబుకు నిరుద్యోగులను మోసం చేయడం ఆనవాయితీగా మారింది. 2014లో కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తానని, అప్పట్లో రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీని చెత్తబుట్టలో పడేశారు. 2019 ఎన్నిలకు ముందు రాజకీయ లబ్ధి కోసం 2018 అక్టోబర్ నుంచి నెలకు రూ.వెయ్యి కొంతమందికి మాత్రమే నిరుద్యోగ భృతి వేసి చేతులుదులుపుకున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు ఇస్తానని, ఉద్యోగం ఇచ్చే వరకూ ‘యువనేస్తం’ పేరిట నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఈ లెక్కన జిల్లాలో నెలకు రూ.139.90కోట్లు ఇవ్వాలి. ‘కూటమి’ మాటలు నమ్మి ఉద్యోగాలపై ఆశతో కోచింగ్ సెంటర్లకు వెళ్లే విద్యార్థులకు ప్రతి నెలా వేల రూపాయలు ఖర్చవుతోంది. ప్రభుత్వం భృతి ఇవ్వకపోవడంతో వారిపై భారీగా ఆర్థిక భారం పడుతోంది. ఓ వైపు ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవు. మరో వైపు భృతి లేకపోవడంతో నిరుద్యోగులు ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
యువనేస్తం.. నిలువునా మోసం
రూ.139.90 కోట్లు
రూ.139.90 కోట్లు
రూ.139.90 కోట్లు
రూ.139.90 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment