సారా తయారీ మానుకోకపోతే పీడీ చట్టం
కర్నూలు: నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలు మానుకోకపోతే పీడీ చట్టంతో జైలుకు పంపుతామని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి హెచ్చరించారు. నవోదయం 2.0లో భాగంగా కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని గుడంబాయి తండా, గుమ్మితం తండాల్లో మంగళవారం నాటుసారా వినియోగం వల్ల కలిగే అనర్థాలపై సీఐ చంద్రహాస్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్.హనుమంతరావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సారీ తయారీని మానుకుని ప్రత్యామ్నాయ ఉపాధితో గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపాలని సూచించారు. సీఐ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment