కర్ణాటక బస్సు ఢీకొని వ్యక్తి మృతి
నందవరం: కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తుతెలి యని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మండల పరిధిలోని హాలహర్వి – చిలకడోణ గ్రామాల మధ్య కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం వద్ద చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. మతిస్థిమిత్తం లేని, గుర్తు తెలియని వ్యక్తి కేజీబీవీ వద్ద జాతీయ రహదారి దాటుతుండగా బెంగళూరు నుంచి మంత్రాలయం వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొంది. ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి కాళ్లకు, తలకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అంబులెన్స్‌లో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతిచెందాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కొండముచ్చు దాడిలో
ఇద్దరికి గాయాలు
కొలిమిగుండ్ల: బందార్లపల్లెలో కొండ ముచ్చు గ్రామస్తులను హడలెత్తిస్తోంది. మంగళవారం ఎస్సీ కాలనీకి చెందిన ఓబులేసుపై దాడి చేయడంతో చెంపకు, మక్కల నాగేంద్ర వీపుపై రక్తగాయాలయ్యాయి. వారం రోజుల నుంచి కొండముచ్చు గ్రామంలో తిష్టవేయడంతో పిల్లలు, మహిళలు, వృద్ధులు భయభ్రాంతులకు గురవుతున్నారు. బయటకు వెళ్లాలంటే ఎప్పుడు వచ్చి దాడి చేస్తోందనని ఆందోళన చెందుతున్నారు. వీధుల్లో సంచరిస్తూ ఇళ్ల ముందు తిష్టవేస్తుండటంతో మహిళలు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. అటవీ శాఖాధికారులు స్పందించి గ్రామంలో నుంచి కొండముచ్చును తరలించే చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు.
నేడు వాహనాల వేలం
కర్నూలు: వివిధ ఎకై ్సజ్ నేరాల్లో పట్టుబడిన వాహనాలను బుధవారం వేలం వేయనున్నట్లు కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ సీఐ చంద్రహాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు వేలం ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఆసక్తి ఉన్నవారు దరావత్ సొమ్ము చెల్లించి వేలంలో పాల్గొనాలని పేర్కొన్నారు. స్థానిక ఎకై ్సజ్ స్టేషన్‌లో వేలం ప్రక్రియ ఉంటుందని సీఐ వెల్లడించారు.
కర్ణాటక బస్సు ఢీకొని వ్యక్తి మృతి
కర్ణాటక బస్సు ఢీకొని వ్యక్తి మృతి
Comments
Please login to add a commentAdd a comment