మూత్ర సమస్యలుంటే నిర్లక్ష్యం చేయొద్దు
చాలా మంది మూత్రసమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటారు. కొన్నిసార్లు అవి సాధారణమే అయినా ఒక్కోసారి అది ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్య గా మారుతుంది. ముఖం ఉబ్బరం, మూత్రంపోయినప్పుడు చురుకు, మంట, ఎరుపు రంగు లో మూత్రం రావడం, మూత్రం సరిగ్గా రాకపోవడం, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం, చిన్న వయస్సులోనే రక్తపోటు లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
–డాక్టర్ పీఎల్. వెంకట పక్కిరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, నెఫ్రాలజి విభాగం, జీజీహెచ్, కర్నూలు
నేడు వైద్యవిజ్ఞాన సదస్సు
అంతర్జాతీయ కిడ్నీ దినో త్సవాన్ని పురస్కరించుకు ని నేడు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఓల్డ్ క్లినికల్ లెక్చర్ గ్యాలరీలో వైద్యవిజ్ఞాన సదస్సు నిర్వహించనున్నాము. లూపస్ నెఫ్రైటిస్ కరెంట్ ట్రీట్‌మెంట్ అండ్ వే ఫార్వర్డ్ అనే అంశంపై హైదరాబాద్‌కు చెందిన సీనియర్ నెఫ్రాలజిస్టు డాక్టర్ ఎ. శశికిరన్ ప్రసంగిస్తారు. ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు ప్రారంభిస్తారు.
–డాక్టర్ ఎస్. అనంత్, ఇన్‌చార్జ్ హెచ్‌ఓడీ, నెఫ్రాలజి విభాగం, జీజీహెచ్, కర్నూలు
●
మూత్ర సమస్యలుంటే నిర్లక్ష్యం చేయొద్దు
Comments
Please login to add a commentAdd a comment