జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దాం
కర్నూలు(సెంట్రల్): జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిద్దామని జిల్లా ఇన్‌చార్జ్ ఆఫీసర్.. రహదారులు, భవనాలు, రవాణా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కాంతిలాల్ దండే సూచించారు. సమర్థవంతమైన పరిపాలనను అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులను జిల్లా ఇన్‌చార్జ్ ఆఫీసర్లుగా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి ఐఏఎస్ అధికారులను జోనల్ ఇన్‌చార్జ్ ఆఫీసర్లుగా నియమించింది. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఇన్‌చార్జ్ అధికారిగా నియమితులైన రహదారులు, భవనాలు, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే శనివారం కర్నూలు వచ్చారు. ఆయన కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పథకాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో పేదరిక నిర్మూలన, ఎంఎస్‌ఎంఈల ఏర్పాటు, విద్య, వైద్య రంగాల అంశాలపై దృష్టి సారిస్తామన్నారు. అనంతరం జిల్లాలో అమలవుతున్న కార్యక్రమాపై కలెక్టర్.. ప్రిన్సిపల్ సెక్రటరీకి వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఆర్వో వెంకట నారాయణమ్మ, సీపీఓ హిమ ప్రభాకరరాజు పాల్గొన్నారు.
ఆర్‌అండ్‌బీ అధికారులతో..
జిల్లా ఇన్‌చార్జ్ ఆఫీసర్ కాంతిలాల్ దండే ఆర్‌అండ్‌బీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జిల్లాలో ముఖ్యమైన రోడ్ల నిర్మాణాలు అవసరం ఉంటే ప్రతిపాదనలు పంపాలని, మిషన్ పాట్ హోల్ కింద పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్‌ఈ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. వాహనాల రిజిస్ట్రేన్లను పెండింగ్‌లో లేకుండా చూసుకోవాలని, ఎన్‌ఫోర్స్‌మెంట్, రిజిస్ట్రేషన్ అంశాలపై నివేదిక ఇవ్వాలని ఆయన డీటీసీ శాంతికుమారికి సూచించారు.
జిల్లా ఇన్‌చార్జ్ ఆఫీసర్ సెక్రటరీ
కాంతిలాల్ దండే
Comments
Please login to add a commentAdd a comment