ఏపీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో ఆది, సోమవారాల్లో జరగనున్న ఏపీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జేసీ డాక్టర్ బి.నవ్య అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ఆమె ఎఫ్‌ఆర్‌ఓ, ఎన్టీఆర్ వైద్య యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్ పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అభ్యర్థులు హాల్ టిక్కెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్నాహ్నం 12 గంటలకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షా సమయం ఉంటుందన్నారు. గంట మందుగానే పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, జిల్లా వైద్య అధికారి శాంతికళ, ఏపీపీఎస్సీ అధికారివెంకట్రావు, ఆర్‌వీ రమణ పాల్గొన్నారు.
జేసీ డాక్టర్ బి.నవ్య
Comments
Please login to add a commentAdd a comment