పెద్దాసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుడి మృతి
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పారిశుద్ధ్య కార్మికుడు జె.నాగేష్(41) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందాడు. మూడు రోజుల క్రితం తను పనిచేసే క్యాజువాలిటీలో అస్వస్థతకు గురి కాగా అక్కడే వైద్యులు చికిత్స అందించి ఇంటికి పంపించారు. ఆదివారం ఉదయం నుంచి మళ్లీ ఆరోగ్యం బాగాలేక పోవడంతో కుటుంబసభ్యులు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే నాగేష్ మరణించాడు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేశారు. మరణించిన అతని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి విజయ రామాంజనేయులు డిమాండ్ చేశారు. సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం వల్లే కార్మికులు శారీరక, మానసిక వేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారితో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు చర్చించి పంపించారు. కార్యక్రమంలో సుజాత, సునీత, విజయ్‌కుమారి, మల్లేశ్వరి, మురళి, ప్రసాద్, మహేష్, డేవిడ్, డ్రైవర్ భాషా, రంగన్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment