పలుమార్లు అర్జీలు ఇచ్చినా స్పందించడం లేదు
నేను దివ్యాంగుడిని. నాకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తప్ప వేరే ఆదాయ మార్గాలు లేవు. రెండు కాళ్లు లేకపోవడంతో ఏ పనీ చేసుకోలేను. సొంత ఇల్లు కూడా లేదు. వచ్చిన పింఛన్‌తో ఇంటి బాడుగ, కరెంటు బిల్లు, ఇంటి ఖర్చులు, అనారోగ్యం కోసం ఖర్చు పెట్టుకోవాలి. నా పరిస్థితిని చూసి ఇంటి స్థలంతోపాటు, ఏదైనా ఔటు సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని పలుమార్లు కలెక్టర్‌కు అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేకపోయింది.
– బోయ మద్దిలేట్టి, ఉల్చాల గ్రామం, కర్నూలు
పెన్షన్ కోసం ఐదుసార్లు అర్జీ
నాకు షుగర్ ఎక్కువై ఒక కాలు ను ఆపరేషన్ చేసి తొలగించారు. రెండేళ్ల నుంచి కాలు లేకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నా. బతుకు భారమైంది. దివ్యాంగుల పెన్షన్ కోసం ఐదుసార్లు కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నా. ఎంపీడీఓను కలవమన్నారు.. అక్కడ కూడా ఎవరూ పట్టించుకోరు.
– వెంకటేశ్వర్లు, కులుమాల, గొనెగండ్ల మండలం
పలుమార్లు అర్జీలు ఇచ్చినా స్పందించడం లేదు
Comments
Please login to add a commentAdd a comment