మాది జనరల్ స్టోర్. రూ.10 నుంచి రూ.5వేల వరకు వివిధ రకాల వస్తువులు విక్రయిస్తాం. వీటిని కొనుగోలు చేసేందుకు ప్రతిరోజూ ఎంతో మంది వస్తుంటారు. ఈ క్రమంలో చిల్లర కొరత బాగా ఎదురయ్యేది. ముఖ్యంగా రూ.10, రూ.20 నోట్ల కొరత కారణంగా ఇబ్బంది పడేవాళ్లం. డిజిటల్ పేమెంట్స్ రాకతో చిల్లర సమస్య తీరింది. 90 శాతం మంది వీటి ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు.
– జి.రాజశేఖర్, వ్యాపారి, కర్నూలు
80 శాతం పైగా
డిజిటల్ పేమెంట్సే..
మాకు హోటల్, కంప్యూటర్ విడిభాగాల వ్యాపారాలు ఉన్నాయి. కోవిడ్‌కు ముందు ఎక్కువగా లావాదేవీలన్నీ నగదు రూపంలో జరిగేవి. కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరూ డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. 80 నుంచి 90 శాతం వీటినే వినియోగిస్తున్నారు. ఫలితంగా మాకు కూడా ప్రతిరోజూ బ్యాంకుకు వెళ్లి డబ్బులు జమ చేసే శ్రమలేదు. మా వద్ద పనిచేసే ఉద్యోగులకు మాత్రం వారి సౌలభ్యం కోసం నగదు రూపంలో జీతం ఇస్తున్నాం.
– భూమా కిశోర్, వ్యాపారి, కర్నూలు
ఎంత ఖర్చు చేస్తున్నామో
తెలియట్లేదు
గతంలో డబ్బు చేతిలో ఉంటే చూసి ఖర్చు పెట్టేవారం. నగదు రూపంలో డబ్బులు ఉండటం వల్ల దేనికెంత ఖర్చు చేస్తున్నామో తెలిసేది. కానీ ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స్ కావడంతో ఎంత ఖర్చు చేస్తున్నామో అర్థంకాని పరిస్థితి. తెలియకుండానే నెలలో 20 నుంచి 30 శాతం ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాం.
– సాయిరామ్, ప్రభుత్వ ఉద్యోగి, కర్నూలు
చిల్లర కొరత తీరింది
చిల్లర కొరత తీరింది