
విద్య, ఉపాధితోనే గ్రామాల అభివృద్ధి
కర్నూలు సిటీ: విద్య, ఉపాధి అవకాశాలతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజీలో ఎకనమిక్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలలో ఉద్యో గ అవకాశాలు – సాధకబాధకాలు అంశంపై ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీ య సదస్సు మంగళవారంతో ముగిసింది. చివరి రోజు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసంగించారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే విద్య అవకాశాలు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక నైపుణ్యాలు అభివృద్ధి కావాలని, స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరాశాంతి, కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బీఆర్ ప్రసాద్ రెడ్డి, సీఐ నాగశేఖర్, ఆర్థిక శాఖ అధ్యాపకురాలు డాక్టర్ సవితదేవి, సదస్సు డైరెక్టర్ డాక్టర్ ఎల్లా కృష్ణ పాల్గొన్నారు.