వెల్దుర్తి: విధి నిర్వహణలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న మైనర్ ఇరిగేషన్, విజిలెన్స్ అధికారులపై తేనెటీగలు దాడి చేశాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎల్ తండా గ్రామ పరిధిలో అదే గ్రామానికి చెందిన రాజు చెక్‌డ్యామ్‌లు నిర్మించాడు. మూడు చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, నాణ్యతలో తేడాలున్నాయని, నిధులు కాజేశారని అందిన ఫిర్యాదుల మేరకు గురువారం విజిలెన్స్ జేఈలు ఆనంద్‌బాబు, శ్రీనివాసరావు ఇరిగేషన్ జేఈ రవినాయక్, క్వాలిటీ కంట్రోల్ జేఈలు కృష్ణప్రియ, మనోజ్, నారాయణ కలిసి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. రెండు చెక్‌డ్యామ్‌ల పరిశీలన అనంతరం మూడవ చెక్‌డ్యామ్ పరిశీలన సందర్భంగా వీరందరిపై చెట్లపొదల్లోని పెద్ద తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. కృష్ణప్రియ ముఖంపై తేనెటీగలు తీవ్రంగా దాడి చేయగా, మనోజ్, ఆనంద్‌బాబను ఓ మోస్తారుగా, రవినాయక్, నారాయణ, శ్రీనివాసరావును స్వల్పంగా గాయపరిచాయి. సమాచారం అందుకున్న ఇరిగేషన్ ఏఈలు రియాజ్, నాగరాజు హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకుని వారిని వెల్దుర్తి సీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్సానంతరం అక్కడి నుంచి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిని విజిలెన్స్ జిల్లా ఎస్పీ చౌడేశ్వరరావు, ఇరిగేషన్ ఎస్‌ఈ ద్వారాకానథ్ రెడ్డిలు పరామర్శించారు. కృష్ణప్రియను వైద్యులు 24 గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచి మిగితా వారిని చికిత్సానంతరం డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు.
చెక్‌డ్యామ్‌లు తనిఖీ చేస్తుండగా ఘటన
ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ జేఈ
పరిస్థితి విషమం
మరో నలుగురికి స్వల్ప గాయాలు
ఇరిగేషన్, విజిలెన్స్ అధికారులపై తేనెటీగల దాడి