పత్తికొండ రూరల్: పత్తికొండలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టును గురువారం జిల్లా జడ్జి కబర్ధి తనిఖీ చేశారు. రెవెన్యూ డివిజన్ కేంద్రమైన పత్తికొండలో సబ్‌కోర్టు ఏర్పాటు ప్రతిపాదనల నేపథ్యంలో భవనం, స్థలం తదితర వివరాలను న్యాయవాదులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక సబ్‌జైలుకు వెళ్లి అక్కడ ఖైదీలకు అందుతున్న సౌకర్యాలను సూపరింటెండెంట్‌తో అడిగి తెలుసుకున్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రంగస్వామి, సీనియర్ న్యాయవాదులు సురేష్, రమణ, కృష్ణ, రవిప్రకాశ్ పాల్గొన్నారు.
విద్యాశాఖ
ఉద్యోగుల అవస్థలు
● మూడు రోజులుగా విద్యుత్ సరఫరాకు
అంతరాయం
కర్నూలు(సిటీ): జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో గత మూడు రోజులుగా కరెంటు లేకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షార్ట్ సర్క్యూట్‌తో విద్యుత్ తీగలు కాలిపోవడం, తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టినా ఫలితం లేకపోవడంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగుతోంది. గురువారం పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఉద్యోగులు అవస్థలు పడుతూ డిప్యూటీ డీఈఓ ఆఫీస్‌లో కూర్చొని పని చేసుకున్నారు. అయితే ఆఫీసులో విద్యుత్ సరఫరా లేకపోవడంతో కంప్యూటర్లు పనిచేయక పూర్తిస్థాయిలో పనిచేయలేని పరిస్థితి నెలకొంది.
కోర్టును తనిఖీ చేసిన జిల్లా జడ్జి